Begin typing your search above and press return to search.

పాపం రష్మిక.. ఏదో అనుకుంటే, ఇంకేదో జరిగింది..!

బడ్జెట్ సమస్యల కారణంగా షాహిద్ కపూర్ సినిమా మొదలుకాకముందే ఆగిపోయింది. ఈ సినిమా ఎప్పటికి మొదలౌతుందో ఎవరికీ తెలీదు

By:  Tupaki Desk   |   1 Sep 2023 2:45 AM GMT
పాపం రష్మిక.. ఏదో అనుకుంటే, ఇంకేదో జరిగింది..!
X

నేషనల్ క్రష్ రష్మిక మందనా దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఛలో మూవీతో తెలుగులోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఇక్కడ స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. ఇప్పుడు బాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా ఎదిగేందుకు తన ప్రయత్నాలు తాను చేస్తోంది. వరసగా గుడ్ బై, మిషన్ మజ్నూ వంటి సినిమాల్లో నటించింది. ఆ సినిమాలపై ఎక్కువ ఆశలు పెట్టుకుంది కానీ, పెద్దగా ఫలితం దక్కలేదు. అయితే, ఎలాగైనా బాలీవుడ్ లో మంచి స్థానం దక్కించుకోవాలని తాపత్రయపడుతోంది.

దీనిలో భాగంగానే, ఆమె బాలీవుడ్ సినిమాల కోసం టాలీవుడ్ లో వస్తున్న ఆఫర్లను పక్కన పెడుతోంది. ఇటీవల నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో ఓ సినిమా ఒకే అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మొదటి నుంచి రష్మికనే హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారు. రష్మిక కూడా ముందు ఒకే చెప్పింది. కానీ, తర్వాత ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది.

బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో కలిసి నటించే అవకాశం రావడంతో, ఆ సినిమా కోసం ఈ సినిమా ను వదులుకుంది. ఈ రెండు సినిమాలకు డేట్స్ కుదరకపోవడంతో ఆమె ఈ నితిన్ సినిమాను వదిలేసింది. షాహిద్ కపూర్ సినిమా కాబట్టి, బాలీవుడ్ లో మంచి క్రేజ్ వస్తుందని అనుకుంది. కానీ, ఆమె ప్లాన్ రివర్స్ అయ్యింది.

బడ్జెట్ సమస్యల కారణంగా షాహిద్ కపూర్ సినిమా మొదలుకాకముందే ఆగిపోయింది. ఈ సినిమా ఎప్పటికి మొదలౌతుందో ఎవరికీ తెలీదు. పాపం, ఏదో అనుకుంటే, ఇంకేదో అయ్యింది. ఈ లెక్కన ప్రస్తుతం రష్మిక చేతిలో పుష్ప2 తో పాటు, యానిమల్ సినిమాలు మాత్రమే ఉన్నాయి. ఈ సినిమాల్లో యానిమల్ షూటింగ్ ఎప్పుడో పూర్తైపోయింది. పుష్ప2 షూటింగ్ లో ఇటీవలే రష్మిక అడుగుపెట్టింది.

ఈ రెండు సినిమాలు అయిపోతే, రష్మిక చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్ లేనట్లే. అయితే, రీసెంట్ ఆమెకు షారూక్ తో నటించే ఓ ఆఫర్ వచ్చింది అంటూ వార్తలు వచ్చాయి. అయితే, ఈ విషయంలో ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు, ఒకవేళ నిజంగా షారూక్ తో ఆఫర్ వస్తే, రష్మిక మళ్లీ ఫామ్ లో కి వచ్చేస్తుంది.