రష్మికకి డిసెంబర్ సెంటిమెంట్ కలిసొచ్చేనా?
సినిమా వాళ్ల సెంటిమెంట్స్ గురించి తెలిసిందే. ప్రారంభోత్సవం నుంచి రిలీజ్ వరకూ ప్రతీది ముహూర్తం తోనే ముడిపడి ఉంటుంది.
By: Tupaki Desk | 14 Aug 2023 9:15 AM ISTసినిమా వాళ్ల సెంటిమెంట్స్ గురించి తెలిసిందే. ప్రారంభోత్సవం నుంచి రిలీజ్ వరకూ ప్రతీది ముహూర్తం తోనే ముడిపడి ఉంటుంది. హీరోలు..నిర్మాతలు ఈ సెంటిమెంట్ ని ఎప్పుడూ బ్రేక్ చేయరు. తాజాగా నేషనల్ క్రష్ బ్యూటీ రష్మిక మందన్న కూడా అలాంటి ఓ సెంటిమెంట్ ఉందని తెలుస్తోంది. ఈ సెంటిమెం ట్ తనకు తానుగా పెట్టుకుంది కాదు..అనుకోకుండా చోటు చేసుకున్న సెంటిమెంట్.
కానీ ఇప్పుడది ప్రత్యేక సెంటిమెంట్ గానూ మారినట్లు కనిపిస్తుంది. ఏడాదిలో అమ్మడు డిసెంబర్ నెల అతి పెద్ద సెంటిమెంట్ గా తెలుస్తుంది. రష్మిక తొలి చిత్రం ‘కిరిక్ పార్టీ’ డిసెంబర్ 31న రిలీజ్ అయి కన్నడలో సూపర్ హిట్ అయింది. అటుపై రెండవ సినిమా ‘అంజనిపుత్ర’ కూడా డిసెంబర్‌లోనే రిలీజై విమర్శకుల ప్రశంసలందుకుంది. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియాలో రిలీజ్ అయిన `పుష్ప` కూడా డిసెంబర్ లోనే ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ అయింది.
డిసెంబర్ 17న ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా రష్మికకి పాన్ ఇండియాలో క్రేజ్ తీసుకొచ్చింది. ఆ సక్సెస్ తో బాలీవుడ్ లోనూ అవకాశాలు అందుకుంటుంది. అమితాబ్ బచ్చన్ తో కలిసి రష్మిక నటించిన తొలి హిందీ చిత్రం `గుడ్‌నైట్` కూడా డిసెంబర్‌లో విడుదలై పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం రష్మిక హిందీలో రణబీర్ కపూర్ సరసన ‘యానిమల్’లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా డిసెంబర్ 1న విడుదల అవుతుంది.
దీంతో ఈ సినిమా విజయంపైనా అమ్మడు ధీమాగా ఉంది. కలిసొచ్చిన డిసెంబర్ నెల తనని మరో స్థాయికి తీసుకెళ్లుందని ఆశాభావం వ్యక్తం చేసింది. `యానిమల్ `పై భారీ అంచనాలున్నాయి. `అర్జున్ రెడ్డి` తర్వాత సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తోన్న సినిమా కావడంతో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం రష్మిక తెలుగులో `పుష్ప 2`.. `రెయిన్ బో` చిత్రాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
