Begin typing your search above and press return to search.

రాశి ఖన్నా.. గ్లామర్ హీటుతో మైండ్ బ్లాక్!

చూడగానే అందమైన చిరునవ్వుతో ఆకట్టుకునే అతి కొద్దిమంది హీరోయిన్స్ లలో రాశిఖన్నా కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు

By:  Tupaki Desk   |   12 April 2024 8:34 AM GMT
రాశి ఖన్నా.. గ్లామర్ హీటుతో మైండ్ బ్లాక్!
X

చూడగానే అందమైన చిరునవ్వుతో ఆకట్టుకునే అతి కొద్దిమంది హీరోయిన్స్ లలో రాశిఖన్నా కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ బ్యూటీ ఇప్పటివరకు చాలా సినిమాలు చేసింది కానీ బాక్సాఫీస్ వద్ద హై రేంజ్ లో అయితే ఒక సాలిడ్ సక్సెస్ అందుకోలేకపోయింది. నటిగా మంచి గ్లామరస్ బ్యూటీగా అమ్మడు ఎప్పటికప్పుడు తనలోని టాలెంట్ ను బయట పెడుతూనే ఉంది.

మొదటి సినిమా ఊహలు గుసగుసలాడే సినిమాతోనే డీసెంట్ సక్సెస్ అందుకుంది ఈ బ్యూటీ. గ్లామరస్ రోల్స్ అంతగా చేయకపోవచ్చు అనేలా కనిపించింది కానీ ఆ తర్వాత అమ్మడు తనలోని అసలైన స్టైల్ ను బయటపెట్టడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. టాప్ గ్లామరస్ బ్యూటీలకు కూడా పోటీ ఇచ్చే విధంగా కొన్ని సినిమాలలో హీటెక్కిచే సన్నివేశాలలో కూడా కనిపించింది.

మంచి క్యారెక్టర్ దొరికితే ప్రయోగాత్మకమైన పాత్రలు చేసేందుకు కూడా సిద్ధమే అని గ్లామర్ రోల్స్ రూల్స్ చేయడానికి ఏమాత్రం వెనుకడుగు వేయను అని చెప్పకనే చెప్పేసింది. ఇక ఆమె నుంచి సినిమాలు వస్తున్నా రాకపోయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన గ్లామర్ తో ఫాలోవర్స్ ను పెంచుకుంటూనే ఉంది. రీసెంట్ గా ఆమె స్టైలిష్ అవతార్ లో డిఫరెంట్ గా దర్శనమిచ్చింది.

ఆ ఫోటోలో అమ్మడు తన లుక్కుతోనే మెస్మరైజ్ చేసింది. ఎద అందాలతో కూడా ఓ వర్గం వారిని ఎంతగానో ఆకట్టుకుంది. రాశి కన్నా ఒకవైపు డ్రెస్సింగ్ స్టైల్ తో ఆకట్టుకుంటూనే మరొకవైపు తన చూపులతో కూడా మరింత హైలెట్ గా నిలుస్తుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. రాశి కన్నా ఎలా కనిపించిన అందంగానే ఉంటుంది అంటూ ఆమె ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే చివరగా తెలుగులో అయితే నాగచైతన్యతో థాంక్యూ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత తమిళ హిందీ సినిమాలతో కూడా బిజీ అయిపోయింది. ప్రస్తుతం తమిళంలో అరన్మనై 4 అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా సక్సెస్ అయితే మళ్లీ సౌత్ లో అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే హిందీలో కూడా ఒక రెండు ప్రాజెక్టులు షూటింగ్ దశలో ఉన్నాయి. వీటితోపాటు ఒక వెబ్ సిరీస్ కూడా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ బ్యూటీ పెద్ద హీరోలతో అవకాశాలు అందుకుంటుందో లేదో చూడాలి.