Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : కారులో అందాలు 'రాశి' పోసినట్లు..!

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా

By:  Tupaki Desk   |   9 Dec 2023 2:30 PM GMT
పిక్ టాక్‌ : కారులో అందాలు రాశి పోసినట్లు..!
X

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా. తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు తనను తాను రాశి ఖన్నా చాలా మార్చుకున్నారు. ఆమె పట్టుదలకు అంతా ఫిదా అయ్యారు అనడంలో సందేహం లేదు. చాలా బరువు తగ్గడంతో పాటు, మరింత అందంగా కనిపించింది.


రాశి ఖన్నా కెరీర్‌ ఆరంభంలో కాస్త ఒడిదొడుకులు ఎదుర్కొన్నా కూడా ఆ మధ్య టాలీవుడ్‌ మరియు కోలీవుడ్‌ లో వరుస సినిమాలు చేసింది. ఇప్పుడు టాలీవుడ్‌ లో ఆఫర్లు రాకున్నా కూడా కోలీవుడ్‌ లో మాత్రం బిజీగా ఉంది. రాశి ఖన్నా సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్ గా తన అందాల ఫోటో షూట్స్ ను షేర్‌ చేస్తూ ఉంటుంది.


ఈసారి కాస్త విభిన్నంగా ఆలోచించిన రాశి ఖన్నా కారులో తీసుకున్న సెల్ఫీలను సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్స్‌ కి చూపించి వినోదాన్ని పంచింది. అందమైన రాశి ఖన్నా చాలా క్యూట్‌ అండ్‌ సూపర్‌ లుక్ లో కారులో నిజంగా అందాలు ఆరబోసినట్లుగా ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.


రాశి ఖన్నా ఇంత అందంగా ఉన్నా.. ప్రతిభ విషయంలో చాలా మంది హీరోయిన్స్ కంటే కూడా ముందు ఉన్నా కూడా పాపం టాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ పట్టించుకోవడం లేదు అనే విమర్శలను కొందరు ఫ్యాన్స్ చేస్తున్నారు. ఇలాంటి అందమైన ఫోటోలను షేర్‌ చేస్తున్న నేపథ్యంలో మళ్లీ టాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ దృష్టిలో పడి ఆఫర్లు దక్కించుకుంటుందేమో చూడాలి.