Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్ రేంజ్ మామూలుగా లేదే!

ఫాంలో ఉన్న భామ‌ల‌కే అవ‌కాశాలు. కాంపిటీష‌న్ రేసులో ఉన్నా ఛాన్సులు రావ‌డం అన్న‌ది అంత ఈజీగా లేదు.

By:  Tupaki Desk   |   29 Oct 2023 10:31 AM GMT
ఆ హీరోయిన్ రేంజ్ మామూలుగా లేదే!
X

ఫాంలో ఉన్న భామ‌ల‌కే అవ‌కాశాలు. కాంపిటీష‌న్ రేసులో ఉన్నా ఛాన్సులు రావ‌డం అన్న‌ది అంత ఈజీగా లేదు. ఓవైపు కొత్త భామ‌ల నుంచి పోటీ...మ‌రోవైపు సీనియ‌ర్ నాయిక‌లు నుంచి..ఫాంలో ఉన్న న‌టీమ‌ణుల్ని క్రాస్ చేసుకోవ‌డం ఛాన్స్ అందుకోవ‌డం అంటే ల‌క్ ఉండాలి. ఆ విష‌యంలో చెన్నై బ్యూటీ ప్రియాంక మోహ‌న్ అదృష్ట వంతురాలిగానే క‌నిపిస్తుంది. నాని హీరోగా న‌టించిన గ్యాంగ్ లీడ‌ర్ త‌ర్వాత శ్రీకారంలో న‌టించిన బ్యూటీకి రెండు సినిమాలు చేదు అనుభ‌వాన్నే మిగిల్చాయి.

దీంతో ఏడాదిన్న‌ర పాటు తెలుగు ఛాన్సులు రాలేదు. అయితే కోలీవుడ్ లో మాత్రం బిజీగానే గ‌డిపింది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న ఓజీలో ఛాన్స్ అందుకుంది. ఇప్పుడిదే అవ‌కాశం కొత్త అవ‌కాశాలు దారులు వేసిన‌ట్లు క‌నిపిస్తుంది. ఇటీవ‌లే మ‌రోసారి నేచుర‌ల్ స్టార్ నాని స‌ర‌స‌న సరిపోదా శ‌నివారంలో ఛాన్స్ ద‌క్కించుకుంది. ప్లాప్ ఇచ్చిన హీరోయిన్ ని మ‌ళ్లీ నాని సినిమాకి ఎంపిక చేయ‌డం ఏంటి? అన్న ఓ సందేహం ఉన్నా? దానికి బ‌ధులు రిలీజ్ త‌ర్వాత దొరుకుతుంది.

తాజాగా అమ్మ‌డు ర‌వితేజ క‌థానాయ‌కుడిగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న చిత్రంలోనూ ఈ భామ‌నే తీసుకుంటున్న‌ట్లు వినిపిస్తుంది. ఇవిగాక మ‌రో రెండు ఛాన్సులు చేతిలో ఉన్నాయ‌ని అంటు న్నారు. వాటిలో ప‌లువురి భామ‌ల్ని ప‌రిశీలించి చివ‌రిగా ప్రియాంక ద‌గ్గ‌ర లాక్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని వినిపిస్తుంది. తెలుగు లో సక్సెస్ లు లేక‌పోయినా అమ్మ‌డు అవ‌కాశాల‌తో మాత్రం ముందంజ‌లో ఉంది.

ఓజీని రెండు భాగాలు రిలీజ్ చేస్తున్నారు. ఇదొక గ్యాంగ‌స్ట‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న చిత్రం. ప్రియాంక పాత్ర కీల‌కంగా ఉంటుంద‌ని వినిపిస్తుంది. ఈసినిమాపై అమ్మ‌డు సైతం ఆశ‌లు భారీగానే పెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది. ఓజీ క్రేజ్ తో కొత్త అవ‌కాశాలు అందుకుంటుంది. అయితే ఓజీ ఫ‌లితం అమ్మ‌డి ఫేట్ ని డిసైడ్ చేస్తుంద‌న్న‌ది గుర్తంచుకోవాలి. ప‌వ‌న్ స‌ర‌స‌న న‌టించిన హీరోయిన్లు టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ల‌గా మారింది చాలా త‌క్కువ మందే. మ‌రి వాళ్ల‌లో ప్రియాంక నిలుస్తుందా? లేదా? అన్న‌ది చూడాలి.