Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : క్యూట్‌ రౌడీ బ్యూటీ కవ్వింపులు

విజయ్ దేవరకొండ హీరోగా 2018 సంవత్సరంలో వచ్చిన టాక్సీవాలా సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక జవాల్కర్ నటించిన విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   6 Sep 2023 4:28 AM GMT
పిక్ టాక్ : క్యూట్‌ రౌడీ బ్యూటీ కవ్వింపులు
X

విజయ్ దేవరకొండ హీరోగా 2018 సంవత్సరంలో వచ్చిన టాక్సీవాలా సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక జవాల్కర్ నటించిన విషయం తెల్సిందే. అంతకు ముందే ఈమె సినిమాల్లో నటించినా కూడా ఆ సినిమాలు పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. కానీ ట్యాక్సీవాలా సినిమాకు ఈమెకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది అనడంలో సందేహం లేదు.


ఆ సినిమా తర్వాత తెలుగు లో పలు సినిమాల్లో నటించే ఛాన్స్ ను దక్కించుకుంది. హీరోయిన్‌ గా నే కాకుండా కీలక పాత్రల్లో ప్రత్యేక పాటల్లో కూడా కనిపించేందుకు ఆసక్తి చూపిస్తున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ వార్తల్లో నిలుస్తూ సోషల్‌ మీడియాలో సందడి కంటిన్యూ చేస్తోంది.

తాజాగా ఈ అమ్మడు ఈ ఫోటోలను షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా స్కిన్‌ షో చేసే ఈ అమ్మడు ఈసారి నడుము ను చూపించి చూపించకుండా చూపిస్తూ, క్యూట్ గా కవ్విస్తున్న ఈ అమ్మడు నెట్టింట సందడి చేస్తోంది. స్కిన్‌ షో చేయకున్నా కూడా భలే ఉందే అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. మరో రెండు సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని కూడా సమాచారం అందుతోంది. మొత్తానికి ఈ అమ్మడు ఇండస్ట్రీలో మెల్ల మెల్లగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది.