Begin typing your search above and press return to search.

ప్రగ్యా గ్లామర్ ట్రీట్.. అసలు ఏం తక్కువైందని?

చూడగానే అందమైన చిరునవ్వుతో ఆకట్టుకునే అతికొద్ది మంది హీరోయిన్లలో ప్రగ్యా జైస్వాల్ కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు

By:  Tupaki Desk   |   1 April 2024 7:19 PM GMT
ప్రగ్యా గ్లామర్ ట్రీట్.. అసలు ఏం తక్కువైందని?
X

చూడగానే అందమైన చిరునవ్వుతో ఆకట్టుకునే అతికొద్ది మంది హీరోయిన్లలో ప్రగ్యా జైస్వాల్ కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి వచ్చి ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా సరైన ట్రాక్ లోకి అయితే రాలేకపోతోంది. మొదట్లో కొన్ని డీసెంట్ సినిమాలతో మంచి విజయాలు అందుకున్నప్పటికీ ఆ తరువాత ఆమె చేసిన కొన్ని సినిమాలు దారుణంగా దెబ్బ కొట్టడంతో అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి.

అయితే ఈ బ్యూటీ అందం విషయంలో మాత్రం ఎప్పుడూ కూడా నిరాశపరచలేదు. ప్రతి సినిమాలో కూడా తన పాత్రకు బాగానే న్యాయం చేసింది. ముఖ్యంగా ఆమె నటించిన కంచే సినిమా అవార్డులు కూడా తెచ్చి పెట్టింది. ఇక గుంటూరోడు, నక్షత్రం, జయ జానకి నాయక లాంటి సినిమాలలో చేసిన పాత్రలు కూడా బాగానే క్లిక్ అయ్యాయి. ముఖ్యంగా 2021లో బాలయ్య బాబుతో చేసిన అఖండ సినిమా కూడా సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ బ్యూటీ కి భారీ దెబ్బ కొట్టిన సినిమాల్లో మాత్రం సన్నాఫ్ ఇండియా ఒకటి. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తర్వాత అమ్మడికి ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు లేకుండా పోయాయి. ఇక గ్లామర్ విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు తనను తాను సరికొత్తగా ప్రజెంట్ చేసుకుంటూనే ఉంది.

రీసెంట్గా ఈ బ్యూటీ మునుపేన్నడు లేనంత గ్లామర్ తో మరోసారి సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. స్టైలిష్ డ్రెస్సులో ప్రగ్యా ఒకవైపు చిరునవ్వును మరొకవైపు లేగ్స్ అందాలను ప్రజెంట్ చేసిన విధానం ఫాలోవర్స్ కు మంచి కిక్ అయితే ఇచ్చింది. ఈ బ్యూటీకి ఏం తక్కువైందనే ఇండస్ట్రీలో అవకాశాలు రావడం లేదు అనే విధంగా పాజిటివ్ గా ఆమె ఫాలోవర్స్ రియాక్ట్ అవుతున్నారు.

సరైన సినిమా తగిలితే మాత్రం ప్రగ్యా టాప్ పొజిషన్లో ఉంటుంది అని మరి కొందరు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక చివరిగా ఈ బ్యూటీ తెలుగులో అయితే మోహన్ బాబుతో సన్నాఫ్ ఇండియా సినిమా చేసింది. ఆ తర్వాత మరో రెండు కథలు చర్చల దశలో ఉన్నప్పటికీ ఎందుకో సెట్ అవ్వలేదు. ప్రస్తుతం చేతిలో కేవలం ఒక హిందీ సినిమా మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే తమిళంలో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరి ఈ గ్లామరస్ అందాలతో అమ్మడు టాలీవుడ్ లో ఏవైనా కొత్త అవకాశాలు అందుకుంటుందో లేదో చూడాలి.