Begin typing your search above and press return to search.

లెద‌ర్ ప్రాక్ లో ప‌రిమ‌ళించిన బ్యూటీ!

ప్ర‌గ్యా జైశ్వాల్ టాలీవుడ్ జ‌ర్నీ గురించి తెలిసిందే. `మిర్చి లాంటి కుర్రాడు` నుంచి `స‌న్నాఫ్ ఇండియా` వ‌ర‌కూ ప‌డ‌తా లేస్తా సినిమాలు చేసింది.

By:  Tupaki Desk   |   21 March 2024 10:53 AM GMT
లెద‌ర్ ప్రాక్ లో ప‌రిమ‌ళించిన బ్యూటీ!
X

ప్ర‌గ్యా జైశ్వాల్ టాలీవుడ్ జ‌ర్నీ గురించి తెలిసిందే. `మిర్చి లాంటి కుర్రాడు` నుంచి `స‌న్నాఫ్ ఇండియా` వ‌ర‌కూ ప‌డ‌తా లేస్తా సినిమాలు చేసింది. అంత‌కు ముందే కోలీవుడ్ లో ఎంట్రీ.. ఆ త‌ర్వాత బాలీవుడ్ లోనూ లాంచ్ అయింది. ఈ రెండు భాష‌ల‌కంటే బెట‌ర్ గా తెలుగు లోనే సినిమాలు చేసింది. ఇక్క‌డ కూడా కెరీర్ చ‌ర‌మాంకానికి చేరుకోవ‌డం తో పాటు త‌మిళ్..హిందీ భాష‌ల్లో కూడా అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో ఇక ప‌రిశ్ర‌మ నుంచి ఎగ్జిట్ అవ్వాల్సిందే అన్న విమ‌ర్శ‌లు ఎదుర్కుంది. గ‌త ఏడాది పూర్తిగా ఖ‌ళీగానే క‌నిపించింది.


కానీ అమ్మ‌డు మాత్రం ప్ర‌య‌త్నాలు ఏనాడు ఆప‌లేదు. అభిమానుల‌కు నిరంత‌రం ఇన్ స్టా ద్వారా ట‌చ్ లో నే ఉంటుంది. హాట్ ఫోటోల‌తో అల‌రించే ప్ర‌య‌త్నంలో కొంత వ‌ర‌కూ స‌క్సెస్ అయింది. అవ‌కాశాలు లేవు అనే మాట త‌ప్ప‌! అభిమానుల్లోనే ఉన్నాను అనే పాజిటివ్ సైన్ తో ముందుకెళ్తుంది. తాజాగా సొగ‌స‌రి మ‌రో హాట్ ఫోటోతో నెటి జ‌నుల ముందుకొచ్చేసింది. ఇదిగో ఇక్క‌డిలా గోల్డ్ క‌ల‌ర్ ఔట్ ఫిట్ లో అమ్మ‌డు త‌ళ‌త‌ళ లాడిపోతుంది.


లెద‌ర్ ప్రాక్ లో ప్ర‌గ్యా గుభాళింపు మామూలుగా లేదు. సొగ‌సైన భంగిమ‌లో అమ్మ‌డు హోయ‌లు పోయిన తీరు కుర్రాళ్ల‌లో సెగ‌లు పుట్టిస్తుంది. ప్ర‌గ్యా ముస్తాబైన విధానం..స్కిన్ టోన్ ప్ర‌తీది అమ్మ‌డిని మ‌రింత అందంగా తీర్చిదిద్దాయి. మ‌త్తెక్కించే చూపుల‌తో హృద‌యాల్ని చిద్రం చేసేస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. ప్ర‌గ్యా అందానికి అభిమానులంతా ఫిదా అవుతున్నారు.


బ్యూటీని ఉద్దేశించి హాట్ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇక సినిమాల సంగ‌తి చూస్తే అమ్మ‌డు హిందీలో` ఖేల్ ఖేల్ మోయిన్` అనే చిత్రంలో న‌టిస్తోంది. చేతిలో ఉన్నది ఈ ఒక్క చిత్రమే. కొత్త అవ‌కాశాల కోసం అక్క‌డే సీరియ‌స్ గా ట్రై చేస్తుంద‌ని స‌మాచారం. బాలీవుడ్ లో అమ్మ‌డు ఇప్ప‌టివ‌ర‌కూ ఒకే ఒక్క చిత్రం చేసింది. అదీ కెరీర్ ఆరంభంలో. ఆ త‌ర్వాత ఇత‌ర భాష‌ల్లోనే బిజీ అయింది. మ‌ళ్లీ ఇప్పుడు బాలీవుడ్ కే వెళ్లింది.