Begin typing your search above and press return to search.

వీడియో : బికినీ షో తో హీట్ పెంచిన పూనం

2005 సంవత్సరం లో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో 'మొదటి సినిమా' అనే చిత్రం తో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా

By:  Tupaki Desk   |   28 Oct 2023 12:31 PM GMT
వీడియో : బికినీ షో తో హీట్ పెంచిన పూనం
X

2005 సంవత్సరం లో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో 'మొదటి సినిమా' అనే చిత్రం తో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా. ఈ అమ్మడు తెలుగు లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు దక్కించుకుంది.. కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో ఆఫర్లు తక్కువ అయ్యాయి. పెద్ద హీరోల సినిమాల్లో మాత్రమే కాకుండా చిన్న హీరోల సినిమాల్లో కూడా ఈ అమ్మడికి నటించే అవకాశాలు రాలేదు.

తెలుగు లో అవకాశాలు రావట్లేదని ఊరికే కూర్చోకుండా పక్క భాష సినిమా ల్లో ప్రయత్నాలు చేసింది. అక్కడ చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యాయి. తమిళ్‌, కన్నడ మరియు మలయాళం భాషల్లో ఈ అమ్మడు చేసిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. దాంతో అక్కడ క్రమం తప్పకుండా సినిమాల్లో ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.

ఈ మధ్య కాలంలో మళ్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటి వరకు తెలుగు లో కొత్త ఆఫర్లు ఏం రాలేదు. కానీ ముందు ముందు సినిమాల్లో లేదా సిరీస్‌ ల్లో అయినా ఆఫర్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తూ పూనమ్ బజ్వా తెగ సందడి చేస్తోంది.

బొద్దుగా ఉన్నా కూడా ముద్దుగా కనిపించే హాట్ బ్యూటీ కచ్చితంగా ముందు ముందు మరింతగా సోషల్‌ మీడియాలో సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత పీక్స్ కు చేరింది. ఈ అమ్మడు బికినీ లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కెమెరా కు ఫోజ్ లు ఇచ్చింది.

స్విమ్‌ సూట్‌ లో ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేయడం అవసరమా అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. ఇదే రేంజ్ లో అందాలను చూపిస్తూ ఉంటే మరో పదేళ్ల పాటు సినిమాల్లో ఆఫర్ల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు.. వాటంతట అవే వచ్చేస్తాయి అన్నట్లుగా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.