Begin typing your search above and press return to search.

బుట్ట బొమ్మతో అలాంటి సాహసం చేసే వాళ్లు లేరా..

నిన్నటిదాకా ఆమె కావాలని అనుకున్న తెలుగు నిర్మాతలు ఒక్కసారిగా ఆమెను ఎందుకు కాదనుకుంటున్నారో కారణం తెలియట్లేదు

By:  Tupaki Desk   |   19 Feb 2024 4:27 PM GMT
బుట్ట బొమ్మతో అలాంటి సాహసం చేసే వాళ్లు లేరా..
X

తెలుగులో నిన్నటిదాకా సూపర్ ఫాం లో ఉన్న పూజా హెగ్దే గుంటూరు కారం ఛాన్స్ మిస్సైనా మరో అవకాశం వస్తుందని అనుకోగా ఆ తర్వాత ఒక్క సినిమా ఛాన్స్ కూడా అందుకోలేదు. గుంటూరు కారం సినిమా షెడ్యూల్ టైట్ వల్ల ఛాన్స్ మిస్ అవ్వగా ఆ తర్వాత పూజాని మరో సినిమా అవకాశం ఇవ్వకపోవడం అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. పూజా హెగ్దే అంటే చాలు దర్శక నిర్మాతలు ఎవరు అంతగా ఆసక్తి చూపించట్లేదని తెలుస్తుంది.

నిన్నటిదాకా ఆమె కావాలని అనుకున్న తెలుగు నిర్మాతలు ఒక్కసారిగా ఆమెను ఎందుకు కాదనుకుంటున్నారో కారణం తెలియట్లేదు. ఇక లేటెస్ట్ గా ఒక అప్ కమింగ్ డైరక్టర్ ఒక ఫిమేల్ సెంట్రిక్ కథ సిద్ధం చేయగా అందులో హీరోయిన్ గా పూజా హెగ్దేని తీసుకోవాలని నిర్మాతకు సూచించాడట. అయితే ఆ ప్రొడ్యూసర్ మాత్రం పూజాతో లేడీ ఓరియెంటెడ్ కథ అయితే రిస్క్ అని అన్నారట.

సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో నటించే హీరోయిన్స్ లేడీ ఓరియెంటెడ్ కథలను కూడా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అనుష్క, సమంత అలాంటి సినిమాలు కూడా చేస్తూ వచ్చారు. కానీ స్టార్ సినిమాల్లో నటించి సూపర్ క్రేజ్ తెచ్చుకున్న పూజా హెగ్దే మాత్రం అలాంటి ప్రయత్నం చేయలేదు. అలాంటి అవకాశం వస్తే తను చేసేందుకు రెడీ అంటున్నా అలాంటి ఛాన్స్ ఇచ్చే నిర్మాతలు లేకుండా పోతుంది.

పూజా మీద అంత నమ్మకం లేదా ఆమెతో రిస్క్ ఎందుకని ముందడుగు వేయట్లేదా అన్నది తెలియదు కానీ పూజా హెగ్దే తో ఫిమేల్ సెంట్రిక్ సినిమా చేస్తే చూడాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇక సినిమాలు లేకపోయినా తన ఫోటో షూట్స్ తో ఆడియన్స్ ని అలరిస్తూ వస్తుంది బుట్ట బొమ్మ. వెండితెర మీద ఆమెను చూడలేకపోతున్నామనే ఒక్క బాధ తప్ప పూజా హెగ్దే గ్లామర్ ట్రీట్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హంగామా చేస్తుంది. వాటి వల్లే అమ్మడి తిరిగి మళ్లీ టాలీవుడ్ లో ఛాన్స్ లు దక్కించుకోవాలని చూస్తుంది. ఆ అవకాశం ఎప్పుడు ఎవరిస్తారన్నది చూడాలి. తెలుగులో అవకాశాలు లేవు సరే బాలీవుడ్ లో అయినా పూజా కెరీర్ స్వింగ్ లో ఉందా అంటే అక్కడ కూడా అమ్మడికి పెద్దగా ఛాన్స్ లు లేక ఖాళీగా ఉంటుంది. సల్మాన్ తో చేసిన సినిమా వర్క్ అవుట్ అవ్వకపోవడంతో అమ్మడు అక్కడ కూడా కెరీర్ లో ఎదురీదుతోంది.