Begin typing your search above and press return to search.

వీడియో: జియో ప్లాజాని షేక్ చేసిన పూజా

ఇటీవ‌ల బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే పూర్తిగా ముంబై న‌గ‌రానికే అంకిత‌మ‌వుతోంది. టాలీవుడ్ లో అవ‌కాశాల్లేక ముంబై ప‌రిశ్ర‌మ‌లో కెరీర్ గురించి సీరియ‌స్ గా ఆలోచిస్తోంది.

By:  Tupaki Desk   |   1 Nov 2023 9:33 AM GMT
వీడియో: జియో ప్లాజాని షేక్ చేసిన పూజా
X

ఇటీవ‌ల బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే పూర్తిగా ముంబై న‌గ‌రానికే అంకిత‌మ‌వుతోంది. టాలీవుడ్ లో అవ‌కాశాల్లేక ముంబై ప‌రిశ్ర‌మ‌లో కెరీర్ గురించి సీరియ‌స్ గా ఆలోచిస్తోంది. అదే క్ర‌మంలో పూజా స్థానికంగా జ‌రిగే ఈవెంట్ల‌కు ఎటెండ‌వుతూ వేడి పుట్టిస్తోంది. మంగళవారం రాత్రి ముంబైలోని ఒక భారీ స్టార్ స్ట‌డెడ్ ఈవెంట్లో అడుగుపెట్టిన పూజా హెగ్డే స్మోకింగ్ హాట్ లుక్ తో వీక్ష‌కుల‌ను క‌వ్వించింది. బుట్ట‌బొమ్మ‌ సెక్సీ కాఫీ కలర్ గౌను సూట్ ధరించి నగరంలోని జియో వరల్డ్ ప్లాజా గ్రాండ్ లాంచ్ లో ప్ర‌త్య‌క్ష‌మైంది. నెక్‌లైన్ గౌన్ .. థై స్లిట్ ఫ్రాక్ లో మ‌తులు చెడ‌గొట్టింది. పూజా ఒంపుసొంపుల‌ను ఈ డిజైన‌ర్ డ్రెస్ ఎంతో అందంగా ఆవిష్క‌రించింది. గ్లామ్ ఫ్యాక్టర్‌ను పెంచే థై స్లిట్ ఎలివేష‌న్ మ‌రో లెవ‌ల్ అని చెప్పాలి. పూజ మినిమ‌ల్ మేకప్ తో టోన్డ్ బాడీని ఆవిష్క‌రించిన తీరు హీట్ పుట్టించింది


ఈవెంట్ రెడ్ కార్పెట్‌పై పూజా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌గా, కెమెరా ఫ్లాష్ లు మెరుపులు మెరిపించాయి. ఈవెంట్‌కు వెళ్లే ముందు స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్ల‌ కోసం తనదైన శైలిలో చిరునవ్వుతో హాయ్ చెప్పింది. అందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు ఇప్పుడు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. పూజా లేటెస్ట్ ఫోటోషూట్ మాత్ర‌మే కాదు.. తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన హాట్ ఫోటోషూట్ల‌తో హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. ఇటీవల తన 33వ పుట్టినరోజు వేడుక‌ల్ని సుందరమైన మాల్దీవుల్లో జరుపుకుంది. స్పాట్ నుంచి వేడెక్కించే ఫోటోల‌తో ఇంటర్నెట్‌ను మండించింది. పూజా బీచ్‌సైడ్ ఫెస్టివ‌ల్ కి సంబంధించిన‌ ఫోటోలలో టూ హాట్ గా క‌నిపించింది. ఈ భామ‌ ఆకుపచ్చ మోనోకినిలో నృత్యం చేస్తూ అద్భుతంగా కనిపించింది. మినిమలిస్టిక్, మేకప్-ఫ్రీ లుక్ తో సహజ సౌందర్యంతో అభిమానులను ఉర్రూతలూగించింది. పూజ పోస్ట్‌కి, `ఐలాండ్ బేబీ` అని క్యాప్షన్ ఇచ్చింది. పూజా హెగ్డేతో పాటు, జియో వరల్డ్ ప్లాజాలో కరీనా, అలియా భట్, కత్రినా కైఫ్, దీపికా పదుకొనే, మలైకా అరోరా, రితీష్ దేశ్‌ముఖ్, జెనీలియా దేశ్‌ముఖ్ లాంచ్‌కు హాజరయ్యారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. పూజా ఇటీవ‌ల టాలీవుడ్ నుంచి దూర‌మైనా కానీ, బాలీవుడ్ లో వ‌రుస చిత్రాలు చేస్తోంది. ప్ర‌స్తుతం షాహిద్ కపూర్ స‌ర‌స‌న ఓ చిత్రం చేస్తోంది. అధికారికంగా దీనిని ప్ర‌క‌టించారు. పూజా హెగ్డే బ‌ర్త్ డే సంద‌ర్భంగా టీమ్ పూజాకు గ్రాండ్ వెల్ కం చెప్పింది.