Begin typing your search above and press return to search.

ఫోటోషూట్‌: స్ట‌న్నింగ్ పూజా హెగ్డే ఖ‌త‌ర్నాక్ లుక్స్

సోష‌ల్ మీడియాల్లో బుట్ట‌బొమ్మ పూజా హెగ్డేకి ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఈ భామ నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్ల‌తో ఇన్ స్టాను మ‌రిగిస్తోంది

By:  Tupaki Desk   |   31 Aug 2023 4:50 AM GMT
ఫోటోషూట్‌: స్ట‌న్నింగ్ పూజా హెగ్డే ఖ‌త‌ర్నాక్ లుక్స్
X

సోష‌ల్ మీడియాల్లో బుట్ట‌బొమ్మ పూజా హెగ్డేకి ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఈ భామ నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్ల‌తో ఇన్ స్టాను మ‌రిగిస్తోంది. తాజాగా మ‌రో హాట్ ఫోటోషూట్ తో ఫ్యాన్స్ ముందుకు వ‌చ్చింది. ఈ ఫోటోషూట్ గతంలో కంటే మరింత స్టైలిష్‌గా ఆక‌ట్టుకుంటోంది. పూజా హెగ్డే లైఫ్‌స్టైల్ ఆసియా మ్యాగజైన్ కవర్ కోసం పోజులిచ్చింది. ర‌క‌ర‌కాల డిజైన‌ర్ లుక్స్ తో పూజా మ‌తి చెద‌ర‌గొట్టింద‌ని చెప్పాలి.


మ్యాగ‌జైన్ ఇంటర్వ్యూలో తన సినిమా ప్రయాణం గురించి చాలా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. నిజానికి తాను అన‌వ‌స‌ర హంగామాను ఇష్ట‌ప‌డ‌న‌ని, తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచడానికి ఇష్టపడతానని చెప్పింది. వ్య‌క్తిగ‌త జీవితానికి ప్రైవ‌సీకి భంగం క‌ల‌గ‌కుండా ప్ర‌తిదీ బ్యాలెన్స్ చేయగలనని పూజా వెల్ల‌డించింది. నిజానికి పూజా నేప‌థ్యం ప్ర‌కారం.. వైద్యులు, ఉపాధ్యాయుల కుటుంబం నుండి వచ్చిన నటి. లైఫ్ స్టైల్ ఆసియా తాజా ఎడిషన్‌లో ఈ విష‌యాల్ని వెల్ల‌డించింది.


'గుంటూరు కారం' నుంచి ఔట్:

మ‌హేష్ స‌ర‌స‌న 'గుంటూరు కారం' చిత్రంలో పూజా న‌టించాల్సి ఉంది. కానీ ఇంత‌లోనే ర‌క‌ర‌క‌ల కార‌ణాల‌తో ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు సమాచారం. ప్ర‌స్తుతం పూజా తీరిక స‌మ‌యాన్ని త‌న‌కు అనుగుణంగా ఆస్వాధిస్తోంది. గతంలో పూజా కాలికి గాయం కావడంతో కోలుకోవడానికి రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

అదే సమయంలో 'గుంటూరు కారం' షెడ్యూల్స్ వాయిదా వేయాల్సి వచ్చింది. పూజా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ లో త‌న‌కు గాయం అయిన విష‌యాన్ని వెల్ల‌డించింది. అయితే పూజా కాలి గాయం దురదృష్టవశాత్తు వృత్తిపరమైన క‌మిట్ మెంట్ల‌ను ప్ర‌భావితం చేస్తోంద‌ని టాక్ వినిపించింది. పూజా కాలుకి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉంటుంద‌ని, దీంతో కొద్దికాలం పాటు కెరీర్ కి బ్రేక్ ప‌డుతుంద‌ని భావిస్తున్నారు. రాధే శ్యామ్ - బీస్ట్ చిత్రీకరణల స‌మ‌యంలోనే పూజా కాలి గాయంతో బాధపడుతోంద‌ని క‌థ‌నాలొచ్చాయి. పూజా హెగ్డే చివరిసారిగా సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌లో కనిపించింది. ఈ సంవత్సరం ఏప్రిల్ 21 న ఈ చిత్రం విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఇది తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది.


హిందీ కెరీర్‌లోను తీవ్ర నిరాశ‌:

పూజా హెగ్డేని తొలి నుంచి దుర‌దృష్టం వెంటాడుతోంది. ఈ భామ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న భారీ చిత్రం 'మొహంజోదారో' బాలీవుడ్ లో అత్యంత బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ల‌లో ఒక‌టిగా నిలిచింది. గ్రీక్ గాడ్ హృతిక్ రోష‌న్ స‌ర‌స‌న క్రేజీగా అవ‌కాశం అందుకున్నా కానీ.. అది త‌న‌కు ఏమాత్రం క‌లిసి రాలేదు. ఆ త‌ర్వాత హిందీ ప‌రిశ్ర‌మ‌లో పూజా హ‌వా కొన‌సాగ‌లేదు. స‌ల్మాన్ భాయ్ స‌ర‌స‌న 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' చిత్రంలో జాక్ పాట్ వ‌రించినా కానీ ఆ సినిమా కూడా డిజాస్ట‌రైంది. అదే క్ర‌మంలో హిందీ నిర్మాత‌ల దృష్టిలో ఐరన్ లెగ్ గా ముద్ర ప‌డింది. త‌మిళంలో ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న బీస్ట్ చిత్రం డిజాస్ట‌ర‌వ్వ‌డం పూజాకి అతి పెద్ద మైన‌స్ అయింది. ఇక సౌత్ లో పూజా కెరీర్ ద‌ళ‌ప‌తి విజ‌య్ స‌ర‌స‌న ప్రారంభ‌మైంది. కానీ విజ‌య్ తోనే న‌టించిన బీస్ట్ పాన్ ఇండియా మార్కెట్లో అంతే పెద్ద ఫ్లాపవ్వ‌డం నిరాశ‌ప‌రిచింది.