Begin typing your search above and press return to search.

2023 అమ్మడికి భలే కలిసి వచ్చింది...!

2023 సంవత్సరం సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలా మందికి నిరాశ మిగల్చగా, కొందరికి మాత్రం భలే కలిసి వచ్చింది

By:  Tupaki Desk   |   31 Dec 2023 6:03 AM GMT
2023 అమ్మడికి భలే కలిసి వచ్చింది...!
X

2023 సంవత్సరం సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలా మందికి నిరాశ మిగల్చగా, కొందరికి మాత్రం భలే కలిసి వచ్చింది. ఈ ఏడాదిలో చాలా మంది హీరోయిన్స్‌ కి మంచి గుర్తింపు లభించింది. అందులో వైష్ణవి చైతన్య ఒకరు అనడంలో సందేహం లేదు. అలాగే పాయల్ రాజ్‌ పూత్‌ కి కూడా ఈ ఏడాది బాగా కలిసి వచ్చింది.

ఆర్‌ఎక్స్ 100 సినిమా తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న పాయల్‌ ఆ తర్వాత చాలా ఆఫర్లు దక్కించుకుంది. కానీ ఏ ఒక్కటి ఆర్‌ఎక్స్ 100 సినిమా స్థాయిలో పాయల్‌ కి హిట్ ను ఇవ్వలేదు. దాంతో పాయల్ కెరీర్‌ మెల్ల మెల్లగా డౌన్ ఫాల్‌ అయినట్లుగా కొందరు కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు.

ఇక పాయల్‌ రాజ్ పూత్‌ పని అయిపోయినట్లే అనుకుంటూ ఉన్న సమయంలో మంగళవారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక మానసిక సమస్య తో బాధపడే అమ్మాయి పాత్రలో పాయల్ కనిపించింది. మరీ ఇంత బోల్డ్‌ గా నటించేందుకు సాధారణంగా ఎవరు కూడా అంగీకరించరు.

పాయల్‌ దర్శకుడు అజయ్‌ భూపతి పై నమ్మకంతో మంగళవారం సినిమాకు ఓకే చెప్పింది. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు పాయల్ రాజ్ పూత్‌ కి మరో సారి బిజీ అయ్యే ఛాన్స్ ఇచ్చింది. 2023 సంవత్సరం పాయల్‌ కి మరో టర్నింగ్‌ పాయింట్‌ గా మంగళవారం సినిమాను ఇచ్చింది.

మంగళవారం సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యం లో ఈ అమ్మడికి భలే ఆఫర్లు లభిస్తున్నాయట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం 2024 లో పాయల్‌ నుంచి కనీసం నాలుగు సినిమాలు అయినా వచ్చే అవకాశాలు ఉన్నాయి.