Begin typing your search above and press return to search.

వీడియో: పాయ‌ల్ అమాయ‌క‌త్వం

ఇటీవ‌ల 'మంగళవరం'లో మ‌రోసారి బోల్డ్ పాత్ర‌లో న‌టించింది. ఈ చిత్రంలో పాయ‌ల్ తీవ్రమైన లైంగిక కోరికలతో బాధపడే అమ్మాయిగా న‌టించింది

By:  Tupaki Desk   |   28 Nov 2023 4:45 PM GMT
వీడియో: పాయ‌ల్ అమాయ‌క‌త్వం
X

త‌న‌దైన అందం, న‌ట‌న‌తో యువ‌హృద‌యాల‌ను కొల్ల‌గొట్టింది పాయ‌ల్ రాజ్ పుత్. ఆర్.ఎక్స్ 100లో అద్భుత సౌంద‌ర్యంతోనే కాదు, ఎంతో విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌తో, డ్యాషింగ్ యాటిట్యూడ్ తో మైమ‌రిపించింది. అందుకే ఇప్పుడు జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస చిత్రాల్లో అవ‌కాశాలు అందుకుంటోంది.

ఇటీవ‌ల 'మంగళవరం'లో మ‌రోసారి బోల్డ్ పాత్ర‌లో న‌టించింది. ఈ చిత్రంలో పాయ‌ల్ తీవ్రమైన లైంగిక కోరికలతో బాధపడే అమ్మాయిగా న‌టించింది. అద్భుతమైన నటనను ప్రదర్శించడానికి లైంగిక చర్యలలో మునిగితేలాక‌ అపరాధభావాన్ని ప్ర‌ద‌ర్శించే యువ‌తిగాను క‌నిపించింది. RX 100 లో బోల్డ్ యాక్ట్ తర్వాత సెక్సీ సైరన్‌గా మారిన పాయల్ రాజ్‌పుత్, తన కోరికలను అదుపు చేసుకోలేని అమాయక పల్లెటూరి అమ్మాయి పాత్రకు మళ్లీ ప్రాణం పోసింది. పాయ‌ల్ భావోద్వేగాలు ప్ర‌ద‌ర్శించిన తీరు థియేట‌ర్ల‌లో హీట్ పుట్టించింది. పాయ‌ల్ మానసిక రుగ్మతకు సానుభూతి వ్య‌క్త‌మ‌వుతుంది కూడా. దర్శకుడు నిమ్ఫోమానియా మర్డర్ మిస్టరీని బాగా మిళితం చేసాడని టాక్ వ‌చ్చింది.

ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లో బోల్డ్ అవ‌తారంలో పాయ‌ల్ హంగామా చూస్తున్నదే. కానీ దానికి భిన్న‌మైన లుక్ తో ఇప్పుడు పాయ‌ల్ క‌నిపించింది. చూడ‌గానే సింపుల్ గా కాలేజ్ గోయింగ్ గాళ్ లా క‌నిపిస్తోంది ఈ కొత్త లుక్ లో. పాయ‌ల్ ని చూడ‌గానే కాలేజ్ బ్యాక్ డ్రాప్ ప్రేమ‌క‌థ‌లు తీయాలేమో అనిపించేంత‌గా క్యూట్ గా క‌నిపిస్తోంది. అలా వాలుగా చూసి పాయ‌ల్ ఎలా క‌వ్విస్తుందో చూస్తున్నారు క‌దా! ప్ర‌స్తుతం ఈ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.

తదుప‌రి పాయ‌ల్ న‌టించే సినిమాపై అప్ డేట్ రావాల్సి ఉంది. పాయ‌ల్ రాజ్ పుత్ తో ఆర్.ఎక్స్ 100 సీక్వెల్ ని తెర‌కెక్కించే అవ‌కాశం ఉందని ఇంత‌కుముందు క‌థ‌నాలొచ్చాయి. పాయ‌ల్ ఎప్ప‌టికీ త‌నకు బిగ్ బ్రేక్ ఇచ్చిన‌ అజ‌య్ భూప‌తిని గురువుగా భావిస్తుంద‌న్న సంగ‌తి తెలిసిందే.