Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : లండన్ బ్రిడ్జీ పై అందాల ఆరబోత

నటిగా ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ అమ్మడు సోషల్ మీడియాలో రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ ఉంటుంది

By:  Tupaki Desk   |   24 Aug 2023 12:46 PM GMT
పిక్ టాక్ : లండన్ బ్రిడ్జీ పై అందాల ఆరబోత
X

ఆర్‌ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్ పూత్‌. ఆ సినిమాలో నెగటివ్ రోల్‌ పోషించిన పాయల్‌ తన నటనతో మంచి మార్కులు సొంతం చేసుకుంది. హీరోయిన్‌ గా పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఐటం సాంగ్స్ లో కూడా నటించి మెప్పించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం కూడా ఈమె చేతిలో పలు సినిమా ఆఫర్లు ఉన్నాయి.


స్టార్‌ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు దక్కకున్నా కూడా చిన్న సినిమా ల్లో కీలక పాత్రల్లో లేదా ఐటం సాంగ్స్ లో కనిపించే అవకాశాన్ని దక్కించుకుంటూ ఉంది. ప్రస్తుతం తెలుగు సినిమాలతో పాటు తమిళ చిత్రాల్లో కూడా నటిస్తోంది. ముందు ముందు హిందీలో కూడా ఈ అమ్మడు మోస్ట్‌ వాంటెడ్‌ నటి అయ్యే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తుంది.


నటిగా ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ అమ్మడు సోషల్ మీడియాలో రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు లండన్ బ్రిడ్జీ పై అందాల ఆరబోత చేస్తూ ఫోటోలకు ఫోజ్ లు ఇచ్చింది. ఈ రేంజ్‌ లో రోడ్డు పై అది కూడా పర్యాటక ప్రదేశంలో షో చేస్తే ఎలా అమ్మడు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.


ఇండియన్ రోడ్ల పై ఇలా స్కిన్‌ షో చేస్తూ అందాల ఆరబోత చేస్తూ నడిస్తే కచ్చితంగా జనాలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చే వారు కదా అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో లండన్ బ్రిడ్జీ పై అందాల ముద్దుగుమ్మ స్కిన్‌ షో అంటూ ఫోటోలు మరియు వీడియోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.