Begin typing your search above and press return to search.

పాయల్ చేతిలో ఉన్నది అదొక్కటేనా..!

By:  Tupaki Desk   |   5 Aug 2023 1:30 AM GMT
పాయల్ చేతిలో ఉన్నది అదొక్కటేనా..!
X

పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న సినిమా మంగళవారం. మహాసముద్రం తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తున్న ఈ మంగళవారం సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆరెక్స్ 100 తో పాయల్ కి ఒక రేంజ్ పాపులారిటీ వచ్చేలా చేసిన అజయ్ భూపతి మరోసారి ఈ సినిమాతో ఆమె గ్రాఫ్ పెంచాలని చూస్తున్నాడు. మంగళవారం సినిమా టీజర్ చూసిన ఎవరైనా సరే పాయల్ కి మళ్లీ మరో అద్భుతమైన పాత్ర దక్కిందని అనుకుంటున్నారు.

మొదటి సినిమా ఆరెక్స్ 100 తోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న పాయల్ ఆ తర్వాత ఆ క్రేజ్ ని నిలబెట్టుకోలేకపోయింది. ఆరెక్స్ లాంటి కథలే వస్తుండటం వల్ల అమ్మడు కాదనేసింది. అయితే వెంకటేష్ లాంటి సీనియర్ హీరోతో ఛాన్స్ వచ్చినా సరే అమ్మడికి లక్ కలిసి రాలేదు. ఇదిలా ఉంటే పాయల్ రాజ్ పుత్ మంగళవారం మీద చాలా హోప్స్ పెట్టుకుంది. సినిమాతో తనలోని మరో యాంగిల్ ని చూపించాలని ఫిక్స్ అయ్యింది అమ్మడు.

అజయ్ భూపతి కూడా మహా సముద్రంతో టార్గెట్ మిస్ అవడంతో మంగళవారం సినిమా కోసం మరింత కసి తో పనిచేశాడు అజయ్ భూపతి. ఈ సినిమా టీజర్ తోనే ఆసక్తి కలిగించాడు. ఈ సినిమాతో పక్కాగా అజయ్ తను అనుకున్న సక్సెస్ అందుకుంటాడని తెలుస్తుంది. పాయల్ రాజ్ పుత్ కూడా ఆరెక్స్ 100 తర్వాత అరడజను సినిమాలు దాకా చేసింది కానీ ఏ ఒక్కటి అమ్మడికి లక్ కలిసి రాలేదు. ఫైనల్ గా మళ్లీ అజయ్ భూపతితోనే కలిసి హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

ఈ సినిమా ఆగష్టు 8న రిలీజ్ చేయాలని అనుకున్నా అది వాయిదా పడింది. సినిమా రిలీజ్ ఎప్పుడన్నది తెలియదు కానీ అజయ్ భూపతి మాత్రం ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడని తెలుస్తుంది. అజయ్ భూపతి పాయల్ రాజ్ పుత్ డైరెక్టర్ హీరోయిన్ కాంబో లో వస్తున్న మంగళవారం కూడా హిట్ పడితే మాత్రం పాయల్ ని అజయ్ ఇక వదిలి పెట్టకుండా తన ప్రతి సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకుంటాడని చెప్పొచ్చు. ఈ సినిమాలో కమల్ కృష్ణ, అజ్మల్ అమీర్, ప్రియదర్శి నటిస్తున్నారు. సినిమాలో పాయల్ పర్ఫార్మెన్స్ చూసి అందరు సర్ ప్రైజ్ అవుతారని అంటున్నారు. మరి పాయల్ మంగళవారం ఎలా ఉండబోతుంది. పాయల్ చేతిలో ఉన్న ఈ సినిమా ఆమెకు హిట్ అందిస్తుందా లేదా అన్నది చూడాలి.