Begin typing your search above and press return to search.

నూపుర్ రెడ్ హాట్ లుక్ వైర‌ల్

నూపుర్ సోష‌ల్ మీడియాల్లోను స్పీడ్ గా ఉంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన దీపావ‌ళి స్పెష‌ల్ లుక్ కుర్ర‌కారు కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీట్ గా మారింది

By:  Tupaki Desk   |   12 Nov 2023 2:45 AM GMT
నూపుర్ రెడ్ హాట్ లుక్ వైర‌ల్
X

'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు' చిత్రంతో క‌థానాయిక‌గా టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైంది నూపుర్ స‌నోన్. 1నేనొక్క‌డినే భామ కృతి స‌నోన్ సోద‌రిగా ఈ అమ్మ‌డు ఇప్ప‌టికే సుప‌రిచితురాలు. నూపూర్ సనన్ అంద‌చందాల‌కు గ్లామ‌ర్ ఎలివేష‌న్ కి భారీ ఫాలోయింగ్ ఉంది. అందానికి అందం ఒడ్డు పొడుగు ఉన్న ఈ భామపై ఇప్పుడు ఇండ‌స్ట్రీ ఫోక‌స్ పెరిగింద‌నేది టాక్.


తెలుగు తెర‌కు తాను ఎలా ప‌రిచ‌య‌మైందో ఇటీవ‌లి ఇంట‌ర్వ్యూలో నూపుర్ తెలిపింది. టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ద‌ర్శ‌కుడు త‌న‌ని ఆడిష‌న్ చేసి ఎంపిక చేసార‌ని వెల్ల‌డించింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడ‌క‌పోవ‌డం నిరాశ‌ప‌రిచింది. అయితే తొలి సినిమా జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా నూపుర్ ప్ర‌తిభ‌కు టాలీవుడ్ లో గుర్తింపు ద‌క్కుతోంది. త‌దుప‌రి ఓ క్రేజీ ప్రాజెక్టు గురించి ఈ భామ వెల్ల‌డించ‌నుంద‌ని స‌మాచారం. నూపుర్ 2019లో అక్షయ్ కుమార్ సరసన ఒక మ్యూజిక్ వీడియోలో తొలిసారిగా కనిపించింది. ఆ త‌ర్వాత డిస్నీ + హాట్‌స్టార్ ఒరిజినల్ కామెడీ షో పాప్ కౌన్ తో పాటు నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన నూరానీ చెహ్రా అనే హిందీ చిత్రంలోనూ న‌టించింది. ఇప్పటికే 'చెహ్రా విడుదల కావాల్సి ఉంది. కానీ అది ఇప్పుడు డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వ‌స్తుంది.

నూపుర్ సోష‌ల్ మీడియాల్లోను స్పీడ్ గా ఉంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన దీపావ‌ళి స్పెష‌ల్ లుక్ కుర్ర‌కారు కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీట్ గా మారింది. నూపుర్ రెడ్ హాట్ లుక్ సంథింగ్ స్పెష‌ల్ గా ఉందంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఆ ఎరుపు రంగు చున్నీకి త‌గ్గ‌ట్టుగా ఎంపిక చేసుకున్న చోళీ ఎంతో అందంగా కుదిరింది. ఈ హాట్ గాళ్ అంద‌చందాల‌ను ఈ డ్రెస్ ప‌దింత‌లు ఎలివేట్ చేసింద‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ ని యువ‌త‌రం అంత‌ర్జాలంలో వైర‌ల్ గా షేర్ చేస్తోంది.

నుపుర్ సనన్ ఫిల్హాల్ (2019) - ఫిల్హాల్ 2: మొహబ్బత్ (2021) అనే మ్యూజిక్ వీడియోలలో తన కెరీర్‌ను ప్రారంభించింది. 2023లో టెలివిజన్ ధారావాహిక పాప్ కౌన్? - తెలుగు యాక్షన్ చిత్రం టైగర్ నాగేశ్వరరావు లో న‌టించింది. బి ప్రాక్ పాటలు, ఫిల్హాల్ (2019) - ఫిల్హాల్ 2: మొహబ్బత్ (2021) మ్యూజిక్ వీడియోలలో అక్షయ్ కుమార్ సరసన నూపుర్ కనిపించింది. ఈ వీడియోల‌తో గుర్తింపు వ‌చ్చాక నెమ్మ‌దిగా సినీకెరీర్ ని విస్త‌రిస్తోంది.