Begin typing your search above and press return to search.

ఆకుపచ్చ కోకలో విశ్వక్ బ్యూటీ.. సంక్రాంతి సెలెబ్స్ ఇలా!

తెలుగు తెరపై పొడగరి హారోయిన్లలో నివేదా పేతురాజ్ ఒకరు. మంచి హైట్.. అందుకు తగ్గ పర్సనాలిటీతో పడగొట్టేస్తుంది

By:  Tupaki Desk   |   16 Jan 2024 3:51 AM GMT
ఆకుపచ్చ కోకలో విశ్వక్ బ్యూటీ.. సంక్రాంతి సెలెబ్స్ ఇలా!
X

తెలుగు తెరపై పొడగరి హారోయిన్లలో నివేదా పేతురాజ్ ఒకరు. మంచి హైట్.. అందుకు తగ్గ పర్సనాలిటీతో పడగొట్టేస్తుంది. హైట్ వల్ల ఈ బ్యూటీ ఇటు మోడ్రన్ డ్రెస్ లో ఎంత అందంగా ఉంటుందో అటు చీరకట్టులోనూ అంతే అట్రాక్టివ్ గా ఉంటుంది. సాధారణంగా మీడియం హైటున్న హీరోయిన్లకు మాత్రమే ఎక్కువగా అవకాశాలు వస్తాయి.


అంతకుమించి ఉంటే పొడగరి కథానాయకులతోనే జట్టు కట్టాలి. అందువల్లనే కాస్త హైటున్న హీరోయిన్లకు అవకాశాలు తక్కువగానే వస్తుంటాయి. అలా తనకు వచ్చిన అవకాశాలను నివేదా పేతురాజ్ సద్వినియోగం చేసుకుంటూ వెళుతోంది. ఇటీవలే విశ్వక్ సేన్ దాస్ కా ధమ్కీ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన నివేదా, తన గ్లామర్‌తో పాటు పర్ఫార్మెన్స్‌తో ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేసింది.


మరోవైపు, సోషల్ మీడియాలో వరుస ఫొటో షూట్స్ తో సందడి చేస్తుంటుందీ అమ్మడు. మోడ్రన్ ఔట్ ఫిట్స్ తోపాటు చీరల్లో అందాలు ఆరబోస్తుంటుంది. తన లుక్స్ తో కుర్రకారు మతులు పోగుడుతోంది. తాజాగా సంక్రాంతి స్పెషల్ ఫొటోలను షేర్ చేసింది. ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ, పింక్ బ్లౌజ్ తో దిగిన పిక్స్ ను పంచుకుంది. తన ఫ్యాన్స్ కు సంక్రాంతి విషెస్ చెప్పింది.


ఈ సింపుల్ చీరలో నివేదా చాలా అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మిసెస్ బ్యూటీ అంటూ ఆమె ఫొటోలను రీషేర్ చేస్తున్నారు. లైకుల వర్షం కురిపిస్తున్నారు. హ్యాపీ పొంగల్ నివేద బేబీ అంటూ కామెంట్స్ బాక్స్ ను ఫిల్ చేసేస్తున్నారు. ఆకు పచ్చకోక అదిరిపోయిందని చెబుతున్నారు.


శ్రీ విష్ణు మెంటల్ మదిలో సినిమాతో తెలుగు వాళ్లకు హీరోయిన్‍గా పరిచయమైంది నివేద. ఈ మూవీ తర్వాత బ్రోచెవారెవరురా, చిత్రలహరి, అల వైకుంఠపురములో సినిమాల్లో తళుక్కుమంది. రెడ్ మూవీలో పోలీస్‍ గా, విరాటపర్వంలో కీలక పాత్రతో అలరించిన గ్లామర్ బ్యూటీ.. విశ్వక్ సేన్‍తో పాగల్, దాస్ కా ధమ్కీ సినిమాలతో ఆకట్టుకుంది. అలాగే బ్లడీ మేరీ, బూ చిత్రాలతో ఓటీటీల్లో కూడా ఎంట్రీ ఇచ్చింది.