Begin typing your search above and press return to search.

2023 వెళ్లిపోతోంద‌ని క‌న్నీళ్ల‌తో వోడ్కా వొంపిన టీవీ న‌టి!

కొత్తొక వింత పాతొక రోత‌! ఏది ఏమైనా కానీ.. పాతకు టాటా చెప్పి, కొత్త సంవ‌త్స‌రానికి వెల్ కం చెప్పేందుకు యూత్ రెడీ అయిపోతోంది

By:  Tupaki Desk   |   31 Dec 2023 7:04 AM GMT
2023 వెళ్లిపోతోంద‌ని క‌న్నీళ్ల‌తో వోడ్కా వొంపిన టీవీ న‌టి!
X

కొత్తొ క వింత పాతొక రోత‌! ఏది ఏమైనా కానీ.. పాతకు టాటా చెప్పి, కొత్త సంవ‌త్స‌రానికి వెల్ కం చెప్పేందుకు యూత్ రెడీ అయిపోతోంది. నేటి మిడ్‌నైట్ 12గం.ల‌కు సెల‌బ్రేష‌న్స్ పీక్స్ కి చేరుకోనున్నాయి. అయితే ఇది సామాన్య ప్ర‌జ‌ల‌కే కాదు.. సెల‌బ్రిటీ ప్ర‌పంచానికి కూడా ప్ర‌త్యేక‌మైన రోజు. ఇదిగో ఇక్క‌డ టీవీ న‌టి నియా శ‌ర్మ చిల్లింగ్ పార్టీని గ‌మ‌నించారా?


పాపం 2023లో చివ‌రి రోజు రాక ముందే.. ఒక రోజు ముందే ఇదిగో ఇలా త‌న బాధను వ్య‌క్త‌ప‌రిచింది. గ్లాసులో త‌న‌కు న‌చ్చిన బ్రాండ్ మ‌ద్యాన్ని ఒంపి ఇలా ఆవేద‌న‌ను క‌న‌బ‌రిచింది. పైగా ఈ పార్టీ ఫోటోగ్రాఫ్స్ ని ఇన్ స్టాలో షేర్ చేసి విషణ్ణవ‌ద‌నంలో మునిగిపోయింది. ''#లాస్ట్ డే ఆఫ్ 2023 .. కొన్ని అసంభవమైన బంధాలతో సంవత్సరాన్ని ముగిస్తున్నాను.. నాకు ఎప్పటికీ ఇష్టమైన రంగు దుస్తుల్ని ధరిస్తున్నాను'' అని తెలిపింది. అసంభ‌వ‌మైన బంధాలు! అని పేర్కొంది. అంటే త‌న‌కు ఈ సంవ‌త్స‌రం కొత్త ఫ్రెండ్స్ ప‌రిచ‌య‌మ‌య్యారు. అసంభ‌వ‌మైన ఫ్రెండ్స్ అని అర్థం చేసుకోవాలి.


నియా శ‌ర్మ ఇన్ స్టా పోస్ట్ కి బోయ్స్ నుంచి స్పంద‌న అనూహ్యంగా ఉంది. ''బాస్ గర్ల్ #NiaSharma.. నిన్ను చాలా ప్రేమిస్తున్నాను..ఎల్లప్పుడూ & ఎప్పటికీ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు నియా..'' అని ఒక అభిమాని ప్రేమ‌ను కురిపించాడు. నియా శ‌ర్మ‌తో పోటీప‌డుతూ తెలుగు మూవీ టీవీ న‌టీమ‌ణులు ఎవ‌రికి వారు మిడ్ నైట్ పార్టీ కోసం ఇప్ప‌టి నుంచే ఏర్పాట్ల‌లో ఉన్నారు.


13 ఏళ్ల కెరీర్ ప్ర‌స్థానం:

నియా శర్మ 2010లో 'కాళి ఏక్ అగ్నిపరీక్ష'తో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది. ఏక్ హజారోన్ మే మేరీ బెహనా హై వంటి షోలతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఈ కార్యక్రమంలో క్రిస్టిల్ డిసౌజా, కరణ్ థాకర్, కుశాల్ టాండన్ కూడా కీలక పాత్రల్లో నటించారు. రవి దూబే సరసన నటించిన జమై రాజా షోకి కూడా విపరీతమైన ప్రశంసలు పొందింది. నియా ఖత్రోన్ కే ఖిలాడీ -ఝలక్ దిఖ‌లాజా వంటి రియాల్టీ షోలలో కూడా పాల్గొంది.

గత నెలలో నియా పరిశ్రమలో తన 13 సంవత్సరాల వేడుక‌ను జరుపుకుంది. ఈ సంద‌ర్భంగా సోషల్ మీడియాలో ఎమోష‌న‌ల్ లెట‌ర్ ని షేర్ చేసింది. ''టెలివిజన్ ప్రపంచంలో 13 అద్భుతమైన సంవత్సరాలు. అయ్యో! ఈ కేకులు పువ్వులు ప్రతి చిన్న పెద్ద సందర్భంలో..! ఇవేవీ ఎప్పుడూ గుర్తుంచుకోలేదు లేదా లెక్కించలేదు... అని అంది.