Begin typing your search above and press return to search.

ఊరించే వ‌య్యారి భంగిమ‌ల‌కు స‌లాం గులాం

నేహా తన ఇన్‌స్టా ఖాతాలో జిమ్ నుండి నిరంత‌రం ఫోటోలను షేర్ చేస్తుంది. మునుప‌టిలా వ్యాయామం తర్వాత కిల్లర్ అబ్స్‌ను ప్రదర్శించే ఫోటో కాదు ఇది

By:  Tupaki Desk   |   12 Sep 2023 3:59 AM GMT
ఊరించే వ‌య్యారి భంగిమ‌ల‌కు స‌లాం గులాం
X

సోష‌ల్ మీడియాల్లో స్పీడ్ గా ఉండే బ్యూటీగా నేహాశ‌ర్మ గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. అత్యంత ఫిట్‌గా ఆకర్షణీయంగా ఉండే బాలీవుడ్ సెలబ్రిటీగా నేహా శర్మ ఫాలోయింగే వేరు. ఈ భామ త‌న సోద‌రి ఐషా శ‌ర్మ‌తో కలిసి నిరంత‌రం జిమ్, యోగా సెష‌న్స్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోల‌ను షేర్ చేస్తుంటుంది. రెగ్యుల‌ర్ ఔటింగుల‌కు సంబంధించిన ఫోటోషూట్ల‌తోను నేహా అభిమానుల‌కు ట‌చ్ లో ఉంది. ఇటీవ‌ల‌ నేహా తన సెక్సీ ఫోటోలతో ఇన్‌స్టాగ్రామ్‌లో అగ్గి రాజేసింది.


నేహా తన ఇన్‌స్టా ఖాతాలో జిమ్ నుండి నిరంత‌రం ఫోటోలను షేర్ చేస్తుంది. మునుప‌టిలా వ్యాయామం తర్వాత కిల్లర్ అబ్స్‌ను ప్రదర్శించే ఫోటో కాదు ఇది. ఈసారి నేహా స్పోర్ట్స్ బ్లాక్ టీష‌ర్ట్ లో ఒంపుసొంపుల‌ను ప్ర‌ద‌ర్శించి టూ హాట్‌గా కనిపించింది. టాప్ యాంగిల్ నుంచి తీసిన ఈ సెల్ఫీ నేహా ఆల్బ‌మ్ లో వెరీ స్పెష‌ల్ అన‌డంలో సందేహం లేదు. ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఈ ఫోటోగ్రాఫ్ వెంట‌నే అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

క్రూక్, తుమ్ బిన్, యమ్లా పగ్లా దీవానా 2, యంగిస్తాన్, క్యా సూపర్ కూల్ హై హమ్, తానాజీ వంటి చిత్రాలలో నేహా శర్మ న‌ట‌న‌కు పేరొచ్చింది. చివరిగా జోగిర సారా రాలో నవాజుద్దీన్ సిద్ధిఖీతో కలిసి నటించింది. ఈ చిత్రంలో సంజయ్ మిశ్రా, మహాక్షయ్ చక్రవర్తి త‌దిత‌రులు కీలక పాత్రలు పోషించారు. చిరుత త‌ర్వాత ఈ బ్యూటీ తెలుగు సినిమాల్లో న‌టించ‌లేదు. పూర్తిగా హిందీ ప‌రిశ్ర‌మకే అంకిత‌మైంది.

నేహా చెల్లెలు ఐషా శర్మ కూడా అప్ క‌మింగ్ న‌టి అన్న సంగ‌తి తెలిసిందే. నేహా - ఐషా బి టౌన్ హాటెస్ట్ సిస్ట‌ర్స్ గా పాపుల‌ర‌య్యారు. రెడ్ కార్పెట్ ఈవెంట్లలో ఈ భామ‌ల హంగామా నిరంత‌రం చ‌ర్చ‌కు వ‌స్తూనే ఉంది. సిస్ట‌ర్స్ స్నేహం తోబుట్టువుల లక్ష్యాలు అభిమానుల‌కు ఎల్ల‌వేళ‌లా స్ఫూర్తి. న‌ట‌న‌, మోడ‌లింగ్ లో బిజీగా ఉన్నా వారి ఫిట్‌నెస్ రొటీన్‌ల కోసం సమయాన్ని వెచ్చిస్తారు. ఇద్దరు నటీమణులు ఫిట్‌నెస్ విష‌యంలో బలమైన అభిరుచిని క‌లిగి ఉన్నారు.