Begin typing your search above and press return to search.

హాట్ వర్కౌట్‌ ఫోజ్‌ లతో హీట్‌ పుట్టిస్తోంది

రామ్‌ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరుత చిత్రంతో 2007 సంవత్సరం లో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ నేహా శర్మ

By:  Tupaki Desk   |   5 Sep 2023 7:17 AM GMT
హాట్ వర్కౌట్‌ ఫోజ్‌ లతో హీట్‌ పుట్టిస్తోంది
X

రామ్‌ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరుత చిత్రంతో 2007 సంవత్సరం లో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ నేహా శర్మ. మొదటి సినిమా తో పాజిటివ్ టాక్‌ దక్కించుకున్న ఈ అమ్మడు సినిమాల ఎంపిక విషయంలో చిన్న చిన్న తప్పులు చేయడంతో పాటు అదృష్టం కలిసి రాకపోవడంతో హీరోయిన్‌ గా స్టార్‌ డమ్ ను దక్కించుకోవడంలో విఫలం అయింది.


హీరోయిన్ గా చిరుత తర్వాత భారీ విజయాలు సొంతం కాకున్నా కూడా బాలీవుడ్‌ లో కూడా ఈ అమ్మడు మెల్ల మెల్లగా సినిమాలు చేస్తూ క్రేజ్ ను దక్కించుకుంది. ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో వరుసగా హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉండటం వల్ల ఎక్కువగా వార్తల్లో ఉంటుంది. అంతే కాకుండా సినిమాల్లో కూడా ఆఫర్లు దక్కించుకుంటూ ఉంది.

తాజాగా ఈ అమ్మడు వర్కౌట్ ఫోటోలు మరియు జిమ్‌ ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలు అందరి దృష్టి ని ఆకర్షిస్తున్నాయి. నీ వర్కౌట్స్ ఏమో కానీ మాకు చెమటలు పడుతున్నాయి.. ఏంటి ఈ హీట్‌ అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందాల రాసి కి ఎందుకు ఇండస్ట్రీలో సక్సెస్ లు దక్కలేదు పాపం అన్నట్టు కొందరు ఈమె అందాన్ని తెగ పొగిడేస్తున్నారు.

ఆకట్టుకునే రూపంతో పాటు మంచి ఎక్స్‌ ప్రెషన్స్ ఈమె సొంతం. నేహా శర్మ ఎంత స్కిన్‌ షో చేసినా కూడా ఎబ్బెట్టుగా అనిపించదు. అంతే కాకుండా ప్రతి సారి కూడా ఈ అమ్మడి అందాల ఆరబోతకు నెటిజన్స్ ఫిదా అవుతూనే ఉంటారు. తాజా ఫోటోలు అందుకు నిదర్శనం. ఇలాంటి ఫోటోలు షేర్‌ చేస్తూ ఉంటే మరో పదేళ్ల పాటు ఈ అమ్మడి క్రేజ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి.