Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరోకి నయన్‌ సోదరి గానా? ప్రియురాలిగానా?

లేడీ సూపర్ స్టార్‌ నయనతార పెళ్లి అయ్యి పిల్లలకు తల్లి అయిన తర్వాత కూడా వరుసగా సినిమా ఆఫర్లు దక్కించుకుంటూ స్టార్‌ ఆఫ్‌ ది సౌత్ ఇండియాగా, లేడీ సూపర్ స్టార్‌ గా దూసుకు పోతూనే ఉంది.

By:  Tupaki Desk   |   4 May 2024 7:09 AM GMT
స్టార్‌ హీరోకి నయన్‌ సోదరి గానా? ప్రియురాలిగానా?
X

లేడీ సూపర్ స్టార్‌ నయనతార పెళ్లి అయ్యి పిల్లలకు తల్లి అయిన తర్వాత కూడా వరుసగా సినిమా ఆఫర్లు దక్కించుకుంటూ స్టార్‌ ఆఫ్‌ ది సౌత్ ఇండియాగా, లేడీ సూపర్ స్టార్‌ గా దూసుకు పోతూనే ఉంది. ఒక వైపు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తూ, మరో వైపు స్టార్‌ హీరోలకు జోడీగా నటించడం ద్వారా బిజీ బిజీగా నయన్‌ ఉంటుంది.

ఈ లేడీ సూపర్‌ స్టార్‌ ను తాజాగా గీతూ మోహన్ దాస్ సంప్రదించారు అనే వార్తలు వస్తున్నాయి. జాతీయ అవార్డును సొంతం చేసుకున్న గీతూ మోహన్‌ దాస్ ప్రస్తుతం కేజీఎఫ్‌ స్టార్‌ యశ్‌ తో ఒక భారీ సినిమాను రూపొందిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలో నటింపజేయడం కోసం నయనతారను ఈమె సంప్రదించారు అనేది సమాచారం.

ఈ సమయంలోనే జాతీయ మీడియా నుంచి సోషల్‌ మీడియా వరకు పలు రకాల పుకార్లు షికార్లు చేస్తూ నయన్‌ ఫ్యాన్స్ ని కన్ఫ్యూజన్‌ కి గురి చేస్తున్నాయి. అసలు విషయం ఏంటి అంటే యశ్‌, గీతూ మోహన్ దాస్‌ కాంబోలో రూపొందుతున్న 'టాక్సిక్‌' సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ ఖాన్‌ ఒక పాత్రలో నటించబోతుందని వార్తలు వచ్చాయి.

ఇప్పుడు టాక్సిక్‌ లో ఆమె నటించే పరిస్థితి లేదట. ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో పాటు కొన్ని ముందస్తు కమిట్‌మెంట్స్ కారనంగా ఈ కన్నడ సినిమాను తిరస్కరించిందని, దాంతో నయన్ ను ఆమె స్థానంలోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది టాక్‌.

టాక్సిక్‌ లో కరీనాను యశ్‌ కి సోదరి పాత్రకు అనుకున్నారు. ఇప్పుడు నయన్‌ తో యశ్‌ సోదరి పాత్ర పోషించేందుకే గీతూ మోహన్‌ చర్చలు జరుపుతున్నారు అంటూ కొన్ని మీడియా సంస్థలు చెబుతూ ఉంటే మరి కొందరు మాత్రం యశ్‌ కు జోడీగా నయన్ నటించబోతుంది అంటున్నారు.

ఇప్పటికే కియారా అద్వానీ, శృతి హాసన్ ల పేర్లు పరిశీలించి చివరకు నయనతార ను ఎంపిక చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతకు టాక్సిక్‌ లో నయనతార పాత్ర యశ్‌ కి సోదరిగానా? లేదా ప్రియురాలిగా ఉంటుందా అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.