Begin typing your search above and press return to search.

అక్కడ ఫోకస్ చేస్తున్న కోలీవుడ్ భామ..!

లేడీ సూపర్ స్టార్ నయనతార ఇన్నాళ్లు కోలీవుడ్ లోనే తన దూకుడు చూపిస్తుందని అనుకోగా ఇప్పుడు తన ఫోకస్ ని మార్చుకున్నట్టు తెలుస్తుంది

By:  Tupaki Desk   |   23 Feb 2024 1:30 AM GMT
అక్కడ ఫోకస్ చేస్తున్న కోలీవుడ్ భామ..!
X

లేడీ సూపర్ స్టార్ నయనతార ఇన్నాళ్లు కోలీవుడ్ లోనే తన దూకుడు చూపిస్తుందని అనుకోగా ఇప్పుడు తన ఫోకస్ ని మార్చుకున్నట్టు తెలుస్తుంది. ఇన్నాళ్లు తమిళంలోనే తన స్టార్డం కొనసాగిస్తూ వచ్చిన నయన్ అడపాదడపా తెలుగు సినిమాల్లో కూడా చేస్తూ వచ్చింది. టాలీవుడ్ లో సీనియర్ హీరోలకు నయనతార పర్ఫెక్ట్ ఆప్షన్ అనిపించేది. అయితే ఇప్పుడు యువ హీరోయిన్స్ కూడా వాళ్లతో చేస్తుండటం వల్ల నయనతారకు అవకాశాలు తగ్గాయి.

అయితే కోలీవుడ్ లో మాత్రం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ తన ఫ్యాన్స్ ని అలరిస్తూ వస్తుంది. కోలీవుడ్ లో నయన్ కి తిరుగులేని ఇమేజ్ సొంతమైంది. అయితే ఈమధ్య అందరు పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న తరుణంలో నయనతార కూడా నేషనల్ లెవెల్ క్రేజ్ పై కన్నేసింది. ఈ క్రమంలో బాలీవుడ్ లో కూడా తన ఫాం కొనసాగించాలని చూస్తుంది. ఆల్రెడీ బాలీవుడ్ లో లాస్ట్ ఇయర్ జవాన్ తో సెన్సేషనల్ హిట్ అందుకుంది నయనతార.

అంతకుముందు కేవలం తమిళ్ లో మాత్రమే చేస్తూ వచ్చిన నయన్ తమిళ దర్శకుడు అవ్వడం వల్ల జవాన్ లో నటించింది. అయితే జవాన్ తో బాలీవుడ్ లో తనకు వచ్చిన క్రేజ్ ని కొనసాగించే క్రమంలో ఇక మీదట తమిళంలోనే కాదు వరుసగా హిందీలో కూడా సినిమాలు చేయాలని అనుకుంటుందట అమ్మడు. అందుకే అక్కడ మేకర్స్ కు తన ఆసక్తిని తెలిసేలా చేస్తుందని చెబుతున్నారు.

అంతేకాదు అంతకుముందు కోలీవుడ్ లో తప్ప పెద్దగా బయట ఈవెంట్స్ కి కనిపించని నయనతార బాలీవుడ్ లో ఏ చిన్న ఈవెంట్ జరిగినా సరే అక్కడ దర్శనమిస్తుంది. లేటెస్ట్ గా జరిగిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల్లో కూడా తళుక్కున మెరిసింది నయనతార. సో బాలీవుడ్ పై తన ఇంట్రెస్ట్ ని చెప్పకనే చెబుతుంది అమ్మడు. షారుఖ్ తో సూపర్ హిట్ అందుకున్న నయనతార మరో స్టార్ హీరో ఛాన్స్ వస్తే చేసేందుకు రెడీ అనేస్తుందట.

నయనతార నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ ఏంటన్నది త్వరలో తెలుస్తుంది. ఎలాగు టాలీవుడ్ ఆఫర్లు తగ్గాయి కాబట్టి కోలీవుడ్, బాలీవుడ్ రెండు చోట్ల బిజీ అవ్వాలని చూస్తుంది నయనతార. బాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్న నయన్ అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మరి అమ్మడి ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయన్నది చూడాలి.