Begin typing your search above and press return to search.

త‌లైవి నయనతార ఆస్తుల విలువ ఎంత‌?

నయనతారగా ప్రసిద్ది చెందిన డయానా మరియం కురియన్ తనదైన‌ బహుముఖ ప్రజ్ఞతో దక్షిణాది చిత్ర పరిశ్రమను ఏల్తోంది

By:  Tupaki Desk   |   27 Sep 2023 5:12 AM GMT
త‌లైవి నయనతార ఆస్తుల విలువ ఎంత‌?
X

త‌లైవి (నాయ‌కి) గా అభిమానుల నుంచి పిలుపందుకుంది నయ‌న‌తార‌. ఇది అరుదైన గౌర‌వం. అందాల‌ నయనతార దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే నంబ‌ర్ వ‌న్ స్టార్ గా ఎదిగి రెండు ద‌శాబ్ధాల కెరీర్ లో అద్భుతాలు ఎన్నో చేసి చూపించింది. ఇప్పుడు జ‌వాన్ చిత్రంతో 1000 కోట్ల క్ల‌బ్ నాయిక అయింది. ఒక్కో సినిమాకి ఒక్కో అసైన్ మెంట్ కి భారీ పారితోషికం అందుకునే న‌య‌న్ ఈ రెండు ద‌శాబ్ధాల కెరీర్ లో ఎంత సంపాదించింది? త‌న‌ ఆస్తి విలువ ఎంత‌? అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.

అగ్ర క‌థానాయిక న‌య‌నతార‌ ఆస్తుల విలువ సుమారు 200 కోట్లు ఉంటుంద‌ని ఓ అంచ‌నా. ఇందులో ప‌లు న‌గ‌రాల్లో సొంత అపార్ట్ మెంట్లు విల్లాలు- స్థ‌లాలు- కార్లు- ప్ర‌యివేట్ జెట్- క్యాష్ వ‌గైరా ఉన్నాయి. ఒక్కో సినిమాకి సుమారు 8 కోట్ల పారితోషికం అందుకుంటూ ఏడాదికి మూడు నాలుగు సినిమాల్లో న‌టిస్తూ 18ఏళ్ల ప్ర‌యాణంలో న‌య‌న‌తార ఇంత పెద్ద ఆస్తిని ఆర్జించార‌నేది ఒక విశ్లేష‌ణ‌. వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల ఆదాయం దీనికి అద‌నం. అయితే త‌న‌కు కొన్ని ఫిక్స్ డ్ అస్సెట్స్ కూడా ఎంతో విలువైన‌వి ఉన్నాయి. ఖ‌రీదైన కార్లు గ్యారేజీలో ఉన్నాయి.

నయనతారగా ప్రసిద్ది చెందిన డయానా మరియం కురియన్ తనదైన‌ బహుముఖ ప్రజ్ఞతో దక్షిణాది చిత్ర పరిశ్రమను ఏల్తోంది. 2018 లో మొత్తం రూ .15 కోట్ల సంపాదనతో ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో చోటు దక్కించుకున్న న‌య‌న్ గత 17 ఏళ్లలో 75 కి పైగా చిత్రాల్లో నటించింది. 2003 లో జయరామ్ తో కలిసి మలయాళ చిత్రం మనస్సినక్కరేతో ఆమె తొలిసారి నాయిక‌గా అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలోనూ అగ్ర నాయిక‌గా ఎదిగింది. నయనతార కన్నడలో 'సూపర్' సినిమా తో తొలిసారిగా అడుగుపెట్టింది అది ఆమె ఏకైక శాండల్ వుడ్ చిత్రంగా ఉంది. ప్రతి హిట్ చిత్రంతో అభిమానులు నయనతారను లేడీ సూపర్ స్టార్ లేదా చిత్ర పరిశ్రమ 'తలైవి'(నాయ‌కురాలు) అని పొగ‌డ్త‌లు కురిపిస్తున్నారు.

తాజా నివేదిక ప్రకారం నయనతార నికర ఆస్తి విలువ సుమారు సుమారు 200 కోట్లు అని వెల్లడైంది. తమిళ చిత్ర పరిశ్రమలోనే గాక సౌత్ లోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరిగా న‌య‌న్ పేరు మార్మోగుతోంది. నయనతార తన స్వగ్రామమైన కేరళలో ఒక ఫాన్సీ ఇల్లు కలిగి ఉంది. అయితే ఈ ఫోటోలు నెట్ లో అందుబాటులో లేవు. ఒక ప్ర‌ముఖ మీడియా క‌థ‌నం ప్రకారం,.. నయనతార కేరళలోని ఒక బంగ్లా యజమాని మాత్రమే కాదు.. ఇటీవల చెన్నైలో ఒక ఖరీదైన అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేసింది.

కార్ల విషయానికి వస్తే.. నయనతార ఖరీదైన BMW X5 యజమాని. ఈ స్వాంకీ కార్ ధర 75.21 లక్షలు. నయనతారకు ఆడి క్యూ 7 కూడా ఉంది. ఈ రోడ్ రేంజర్ అంచనా వ్యయం సుమారు రూ .80 లక్షలు.

ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివన్ ని న‌య‌న్ పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ఈ జంట ఆద‌ర్శ‌వంత‌మైన మ్యారీడ్ లైఫ్ నేటిత‌రానికి స్ఫూర్తి. ఈ జంట‌కు స‌రోగ‌సీలో జన్మించిన‌ ట్విన్స్ ఉన్నారు.

న‌య‌న్ ఇంటి విలువ 100కోట్లు:

తమిళనాడు నుండి ముంబై వరకు విస్తరించి ఉన్న నాలుగు విభిన్న‌ ఆస్తులలో ఆమె రూ. 100 కోట్ల విలువైన స్వ‌గృహాన్ని న‌య‌న్ క‌లిగి ఉంది. ప్రస్తుతంతన భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి 4 BHK విల్లాలో నివసిస్తోంది. దీని విలువ భారీ మొత్తంలో ఉంటుంది. ఈ ఇంటి విలువ రూ. 100 కోట్లు. ఈ విలాసవంతమైన నివాసం ఒక ప్రైవేట్ సినిమా హాల్, స్విమ్మింగ్ పూల్, వ్యాయామశాల వంటి ప్రత్యేక సౌకర్యాలను కలిగి ఉంది. నయనతారకు హైదరాబాద్‌- బంజారాహిల్స్‌లో రెండు అపార్ట్‌మెంట్ లు ఉన్నాయి. వాటి విలువ సుమారు రూ. 30 కోట్లు ఉంటుంద‌ని స‌మాచారం. నయనతార తమ స్వంత ప్రైవేట్ జెట్ లో ప్ర‌యాణిస్తుంది. ఈ ప్రైవేట్ జెట్ విలువ సుమారు రూ. 50 కోట్లు. నయనతార ర‌క‌ర‌కాల వ్యాపారాల్లో పెట్టుబ‌డులు పెట్టింది. పాపుల‌ర్ లిప్ బామ్ కంపెనీ..యుఎఇకి చెందిన ఆయిల్ కంపెనీ సహా వివిధ వ్యాపార సంస్థలలో వాటాలను కలిగి ఉందని స‌మాచారం. తన భర్త విఘ్నేష్‌తో కలిసి నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్ బ్యానర్‌కు సహ యజమానిగా సినిమాల‌ను నిర్మిస్తున్నారు.