Begin typing your search above and press return to search.

ఆ డైరెక్టర్ కి వాళ్ల నుంచి మోక్షం ప్రసాధించిన హీరోయిన్..!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న అట్లీ షారుఖ్ తో జవాన్ సినిమాను డైరెక్ట్ చేసి పాన్ ఇండియా డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు

By:  Tupaki Desk   |   22 Sep 2023 5:39 AM GMT
ఆ డైరెక్టర్ కి వాళ్ల నుంచి మోక్షం ప్రసాధించిన హీరోయిన్..!
X

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న అట్లీ షారుఖ్ తో జవాన్ సినిమాను డైరెక్ట్ చేసి పాన్ ఇండియా డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. అట్లీ మీద షారుఖ్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. దశాబ్ద కాలంగా సరైన సక్సెస్ లేక షారుఖ్ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాపులు అందుకుంటున్న టైం లో ఈ ఇయర్ మొదట్లో ఆల్రెడీ పఠాన్ తో సూపర్ హిట్ అందుకోగా ఆ హిట్ మేనియాని కొనసాగిస్తూ జవాన్ తో మరో సెన్సేషనల్ హిట్ అందుకునేలా చేశాడు అట్లీ.

ఈ సినిమాలో నయనతార, దీపిక పదుకొనే హీరోయిన్స్ గా నటించారు. జవాన్ రిలీజ్ తర్వాత తన సీన్స్ చాలా వరకు ట్రిమ్ చేశారని. అట్లీ మీద హీరోయిన్ నయనతార కోపంగా ఉందని వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని నయనతార అట్లీకి బర్త్ డే విషెస్ చెబుతూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. హ్యాపీ బర్త్ డే అట్లీ ప్రౌడ్ ఆఫ్ యు అంటూ నయనతార విషెస్ అందించింది.

జవాన్ లో తన పాత్ర పట్ల నయనతార అసంతృప్తిగా ఉందన్న వార్తలు ఓ పక్క వైరల్ అవుతుండగా అదే డైరెక్టర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ నయనతార ఇన్ స్టా స్టేటస్ రూమర్స్ కి చెక్ పెట్టింది. ఈమధ్య జవాన్ విషయంలో నయన్ అప్సెట్ అంటూ ఆమె ఫ్యాన్స్ అట్లీ మీద గుర్రుగా ఉండగా మా మధ్య అలాంటిది ఏమి లేదని డైరెక్టర్ కి బర్త్ డే విషెస్ చెప్పి క్లారిటీ ఇచ్చింది నయనతార. అంతేకాదు ఇలాంటి వార్తలు సృష్టించే వారికి కూడా చెంపపెట్టుగా కూడా నయన్ రెస్పాన్స్ ఉందని చెప్పొచ్చు. ఇన్నాళ్లు కోలీవుడ్ లో తన టాలెంట్ చూపించిన నయనతార జవాన్ హిట్ తో వరుస బాలీవుడ్ అవకాశాలను అందుకుంటుంది.

కోలీవుడ్ లో తన ప్రత్యేకమైన సినిమాలతో స్టార్స్ కి సైతం పోటీ ఇస్తున్న నయనతార బాలీవుడ్ ఎంట్రీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక మీదట తను చేసే సినిమాలు నేషనల్ వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తుంది నయనతార. ఎలాగు ఆమెకు సౌత్ అంతా భారీ మార్కెట్ ఉంది కాబట్టి ఇప్పుడు హిందీలో కూడా తన సత్తా చాటాలని చూస్తుంది. జవాన్ తర్వాత రెండు తమిళ సినిమాలు చేస్తున్న నయనతార ఆ తర్వాత సినిమాల గురించి డీటైల్స్ బయటకు రావాల్సి ఉంది.

తెలుగులో కూడా స్టార్ హీరోలందరితో కలిసి నటించిన నయనతార ప్రస్తుతం తమిళ హిందీ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల టాలీవుడ్ ఆఫర్లకు నో చెబుతుందని తెలుస్తుంది. మరీ కథ నచ్చి రెమ్యునరేషన్ కూడా టెంప్ట్ చేస్తే తప్ప ఇప్పుడప్పుడే తెలుగులో నయనతార నటించే అవకాశం లేదని చెప్పుకుంటున్నారు.