Begin typing your search above and press return to search.

RGV డిస్క‌వ‌రీ ఇలా అయిపోయిందేమిటి?

రామ్ గోపాల్ వ‌ర్మ‌ డిస్క‌వ‌రీ న‌థాలియా కౌర్ చాలా కాలంగా బాలీవుడ్ కి దూర‌మైన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   29 Jan 2024 4:02 AM GMT
RGV డిస్క‌వ‌రీ ఇలా అయిపోయిందేమిటి?
X

రామ్ గోపాల్ వ‌ర్మ‌ డిస్క‌వ‌రీ న‌థాలియా కౌర్ చాలా కాలంగా బాలీవుడ్ కి దూర‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ బ్రెజిలియ‌న్ బ్యూటీ కేవ‌లం మోడ‌లింగ్ అసైన్ మెంట్స్ తో మాత్ర‌మే అప్పుడ‌ప్పుడు ట‌చ్ లోకి వ‌స్తోంది. ఇక సోష‌ల్ మీడియాలో త‌న హాట్ బాడీని ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల కోణాల్లో ఎలివేట్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు మ‌రో కొత్త కోణాన్ని ఆవిష్క‌రించింది. ఇటీవ‌లే బ్లాక్ బికినీ తో సెగ‌లు రేపిన ఈ అమ్మ‌డు ఇంత‌లోనే మ‌రో హాట్ ఫోటోషూట్ తో వేడి పెంచింది.


వైట్ ఇన్న‌ర్ లో న‌థాలియా స్పెష‌ల్ గా క‌నిపిస్తోంది. ఇక కెమెరా ముందు న‌థాలియా ఫోజులు, తీక్ష‌ణ‌మైన చూపుల‌తో కిల్ల‌ర్ గాళ్‌ని త‌ల‌పిస్తోంది. అయితే న‌థాలియా ఎంత‌గా ప్ర‌య‌త్నించినా క‌థానాయిక‌గా ఛాన్సులైతే లేవు. అటు బాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ ఈ బ్యూటీకి అవ‌కాశాల్లేవ్. ప్ర‌స్తుతానికి కొన్ని క‌మ‌ర్షియ‌ల్స్ తో పాటు ఇన్ స్టా మాధ్య‌మంలో ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఆదాయ ఆర్జ‌న చేస్తోంది.

న‌థాలియా స్వ‌గ‌తం:

న‌థాలియా నేప‌థ్యం ఆస‌క్తిక‌రం. ఈ బ్యూటీ పూర్తి పేరు నథాలియా పిన్‌హీరో ఫెలిప్ మార్టిన్స్.. వృత్తిరీత్యా నథాలియా కౌర్ అని పిలుస్తారు. బ్రెజిలియన్ మోడల్ కం నటిగా సుప‌రిచితురాలైన ఈ బ్యూటీ భారతీయ సినీప‌రిశ్ర‌మ‌ల్లో పని చేసింది. న‌థాలియా కౌర్ బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జన్మించింది. ఆమె తల్లికి పోర్చుగీస్ వంశం నేప‌థ్యం ఉంది.. అయితే ఆమె తండ్రి పంజాబీ అని చెబుతారు. అలా భార‌తీయ నేప‌థ్యం ఉంది. ఓ ఇంట‌ర్వ్యూలో కౌర్ తాను హాఫ్‌ పంజాబీ అని తెలిపింది. పంజాబ్ తాతయ్య‌, పోర్చుగీస్‌కు చెందిన నాన్నమ్మ గురించి రివీల్ చేసింది.

కౌర్ 14 సంవత్సరాల వయస్సు నుండి మోడల్‌గా పనిచేసింది. భారతదేశంలో త‌లి ఆఫర్‌ను స్వీకరించినప్పుడు పూర్తి సమయం మోడల్‌గా పని చేయడం మానేయడానికి ముందు యూనివర్సిడేడ్ కాండిడో మెండిస్‌లో న్యాయశాస్త్ర విద్య‌ను కొనసాగించింది. ఆమె ఒపెరా సింగర్‌గా కూడా పేరు పొందింది.

అటుపై కౌర్ బ్రెజిల్ సహా ఇతర దేశాలలో మోడల్‌గా అవ‌కాశాలు అందుకుంది. ఆ తర్వాత భారతదేశానికి వ‌చ్చింది. 2012లో కింగ్‌ఫిషర్ క్యాలెండర్ మోడల్ హంట్‌ను గెలుచుకుంది. ఆ సంవత్సరం కింగ్‌ఫిషర్ స్విమ్‌సూట్ క్యాలెండర్‌లో కనిపించింది.

ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం దేవ్ సన్ ఆఫ్ ముద్దె గౌడలో కౌర్ తన సినీ రంగ ప్రవేశం చేసింది. విడుదలకు ముందు రామ్ గోపాల్ వర్మ తన తదుపరి చిత్రం డిపార్ట్‌మెంట్‌లో ఐటెమ్ నంబర్‌ను ప్రదర్శించడానికి న‌థాలియాను ఎంపిక చేశారు. నిజానికి ఆ సినిమాలో ఐట‌మ్ కి వర్మ సన్నీ లియోన్‌ని ఎంపిక చేసుకున్నా జిస్మ్ 2 క‌మిట్ మెంట్ కార‌ణంగా, వర్మ ఆమె స్థానంలో కౌర్‌ని తీసుకున్నారు. 2015లో కలర్స్ టీవీ స్టంట్ షో 'ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 6'లో పాల్గొంది.

కౌర్ మిస్ ముండో ఎస్పిరిటో శాంటో మిస్ బ్రెజిల్ వరల్డ్ 2015 (మిస్ ముండో బ్రెజిల్) పోటీలో పాల్గొంది, అక్కడ టాప్ 10లో నిలిచింది. తరువాత మిస్ రియో డి జనీరో బీ ఎమోషన్ 2015 కాంటెస్టులో టాప్ 15లో నిలిచింది. డిపార్ట్ మెంట్, క‌మెండో, ద‌ళం (తెలుగు), భాయ్, రాకీ హ్యాండ్స‌మ్, గ‌న్స్ ఆఫ్ బెనార‌స్ చిత్రాల‌లో న‌థాలియా న‌టించింది.