Begin typing your search above and press return to search.

ఇస్మార్ట్ బ్యూటీ.. మళ్ళీ ఇన్నాళ్ళకు ఇలా..

నభా నటేష్.. పూరీ జగన్నాథ్- రామ్ పోతినేని కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   26 March 2024 3:30 PM GMT
ఇస్మార్ట్ బ్యూటీ.. మళ్ళీ ఇన్నాళ్ళకు ఇలా..
X

నభా నటేష్.. పూరీ జగన్నాథ్- రామ్ పోతినేని కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినా.. ఇస్మార్ట్ తోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అందం, అభినయం సమపాళ్లలో ఉన్నా.. ఈ అమ్మడికి టాలీవుడ్ లో మంచి ఛాన్సులు రాలేదని చెప్పవచ్చు. చివరగా నితిన్ మూవీ మాస్ట్రోలో కనిపించింది.

ఆ సినిమా తర్వాత తెలుగు మేకర్స్.. ఆమె వైపు కన్నెత్తి కూడా చూడలేదు! అయితే కొన్ని రోజుల పాటు ఎవరికీ కనపడలేదు నభా నటేష్. ఆ తర్వాత తనకు యాక్సిడెంట్ అయిందని, ఎడమ భుజం విరిగిపోయిందని తెలిపింది. ఆపరేషన్ కూడా జరిగిందని పేర్కొంది. ప్రమాదం జరిగిన చాలా రోజుల తర్వాత రివీల్ చేసింది. త్వరలోనే సినిమాలు చేస్తానని, పూర్తిగా కోలుకున్నట్లు కూడా చెప్పింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన కూడా రాలేదు.

ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది నభ. తన గ్లామర్ షోతో మేకర్స్ ను ఆకట్టుకోవాలని చూస్తోంది. రకరకాలుగా స్కిన్ షో చేస్తూ ఫాలోవర్స్ పెంచుకుంటోంది. బోల్డ్ పోజులు ఇస్తూ అలరిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు చిత్రాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయట. ఇండస్ట్రీలో నభ మళ్లీ బిజీగా మారుతోందట.

కార్తికేయ-2తో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం స్వయంభు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. భరత్ కృష్ణమాచార్య తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదే మూవీలో సెకండ్ హీరోయిన్ గా నభా నటేష్ నటిస్తోందట. భువన్ సాగర్ నిర్మిస్తున్న ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు నభ.. హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న కొత్త సినిమాలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో కమెడియన్ ప్రియదర్శి కి జోడీగా నభ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అధికారికంగా ప్రకటన రానుంది. మొత్తానికి నభా నటేష్ ఈ రెండు చిత్రాలతో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తోంది. మరి అది జరుగుతుందా లేదా అనేది చూడాలి.