Begin typing your search above and press return to search.

గుండెల్లో మృణాల్ అల‌జ‌డ‌లు!

మృణాల్ నుంచి ఎన్నో ఫోటోలు ఇన్ స్టాలో వైర‌ల్ అయ్యాయి. కానీ వాట‌న్నిటికి భిన్నంగా ఈ కొత్త ఫోటో యువ‌త‌ని సంథింగ్ స్పెష‌ల్ గా ఆక‌ర్షిస్తుంది

By:  Tupaki Desk   |   16 Nov 2023 8:41 AM GMT
గుండెల్లో మృణాల్ అల‌జ‌డ‌లు!
X

'ఎంత అందంగా ఉన్నావో ఎవ‌రే నువ్వు? నాలో అల‌జ‌డి రేపింది నీ చిరున‌వ్వు.. నా క‌న్నులోనా నీరూపం.. నాక‌న్నా ఎంతో అపురూపం అనిపించే చిన్నారి.. అ అనుభ‌వ‌మే నాకు తొలిసారి అంటూ ఓ పాట అందుకో వాల్సిందే ఈ ఫోటో చూసిన త‌ర్వాత‌. అవును మృణాల్ ఠాకూర్ అలియాస్ సీత‌మ్మ ఇక్క‌డ అంత అందంగా అనిపిస్తుంది. గుండెల్లో అల‌జ‌డి రేపుతుంది. మృణ‌ల్ న్యూ ఫోటో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతుంది.


అందులో అమ్మ‌డు న‌లుపు వ‌ర్ణం డిజైన‌ర్ లెహంగాలో అందాన్నంతా ప‌రిచింది. సొగ‌స‌రి మ్యాక‌ప్ అయిన విధానం... ఎంపిక చేసుకున్న యాక్స‌ర‌సీస్ ..స్కిన్ టోన్ ప్ర‌తీది మృణాల్ ని మ‌రింత అందంగా మ‌లిచాయి. చేతితో చున్నీ ని అలా దూరంగా ప‌రిచి కెమెరాకి ఇచ్చిన ఫోజు చూపరులను ఆక‌ట్టుకుంటుంది. 'సీతారామం' లో ప్రిన్సెస్ నూర్ జ‌హాన్ త‌ర్వాత అంతంటి అందంగా ఈపిక్ లో క‌నిపిస్తుంది.


మృణాల్ నుంచి ఎన్నో ఫోటోలు ఇన్ స్టాలో వైర‌ల్ అయ్యాయి. కానీ వాట‌న్నిటికి భిన్నంగా ఈ కొత్త ఫోటో యువ‌త‌ని సంథింగ్ స్పెష‌ల్ గా ఆక‌ర్షిస్తుంది. ప్రిన్సెస్ అందాన్ని ఓ రేంజ్ లో పొగిడేస్తూ కామెంట్లు క‌నిపిస్తున్నాయి. కొంత మందిబ్యూటీని అలియాభ‌ట్ తో పోలిక చేస్తున్నారు. అలియాకి అక్క‌? చెల్లిగా పోలిక చేయోచ్చు అంటున్నారు.

ఇక టాలీవుడ్ లో అమ్మ‌డికి కొత్త అవ‌కాశాలు అందుకోవ‌డం ఆల‌స్య‌మైనా అన్నీ క్రేజీ ప్రాజెక్ట్ లే చేజిక్కించు కుంటుంది. నేచుర‌ల్ స్టార్ నాని స‌ర‌స‌న 'హాయ్ నాన్న‌'లో...విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో 'ఫ్యామిలీ స్టార్' లోనూ న‌టిస్తోంది. కొన్ని కొత్త ఛాన్సులు క్యూలో ఉన్నాయి. అటు బాలీవుడ్ లోనూ బిజీగా ఉంది. యంగ్ హీరోల‌తో పాటు సీనియ‌ర్ హీరోల‌కు జోడీగానూ ఛాన్సులొస్తున్నాయి.