Begin typing your search above and press return to search.

ఈ వారం బాక్సాఫీస్.. ముగ్గురికి మరో జన్మే..

ఈ శుక్రవారం, నవంబర్ 17 బాక్సాఫీస్ వద్ద ఒక ఆసక్తికరమైన పోటీ కనిపించబోతోంది. సక్సెస్ అందుకొని ఫామ్ లోకి రావాలని ముగ్గురు హీరోయిన్లు వారి లక్కును టెస్ట్ చేసుకుంటున్నారు

By:  Tupaki Desk   |   16 Nov 2023 5:32 AM GMT
ఈ వారం బాక్సాఫీస్.. ముగ్గురికి మరో జన్మే..
X

ఈ శుక్రవారం, నవంబర్ 17 బాక్సాఫీస్ వద్ద ఒక ఆసక్తికరమైన పోటీ కనిపించబోతోంది. సక్సెస్ అందుకొని ఫామ్ లోకి రావాలని ముగ్గురు హీరోయిన్లు వారి లక్కును టెస్ట్ చేసుకుంటున్నారు. సక్సెస్ చూసి చాలా కాలం కావడంతో ఈ శుక్రవారం సక్సెస్ వస్తేనే మరికొంత కాలం ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ఛాన్స్ ఉంటుంది.

ఇక 'RX100' సినిమాతో పాయల్ రాజ్‌పుత్ అప్పట్లో ఏ స్థాయిలో హాట్ టాపిక్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆ సినిమాతో వచ్చిన సక్సెస్ ఆమె కెరీర్ పై ప్రభావం చూపింది. ఆ తరువాత పాజిటివ్ రోల్స్ కంటే నెగిటివ్ షెడ్ ఉన్న రోల్స్ ఎక్కువగా వచ్చాయి. ఇక ఆ దెబ్బతో ఆమెకు మరో రేంజ్ లో మంచి హీరోయిన్ పాత్రలు రాలేదు. అందుకే మరో మంచి సక్సెస్ అందుకొని ఫామ్ లోకి రావాలని అనుకుంటోంది.

ఇక ఇప్పుడు ఆమె RX100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో "మంగళవరం" అనే సినిమా చేసింది. ఈ సినిమా సక్సెస్ కావడం ఆమెకు చాలా అవసరం. ఎలాగైనా ఈ సినిమాతో సక్సెస్ అందుకొని మళ్ళీ ఫామ్ లోకి రావాలని అనుకుంటుంది. ఇక మంగళవారం సినిమా ఈ శుక్రవారం గ్రాండ్గా విడుదల కాబోతోంది.

ఇక మరోవైపు సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్స్ లో మెహ్రీన్ పిర్జాదా కూడా టాప్ లిస్టులో ఉంది అని చెప్పవచ్చు. ఈ బ్యూటీ కెరీర్ మొదట్లో మంచి సక్సెస్ అందుకొని గ్యాప్ లేకుండా సినిమాలు చేసింది. కానీ ఆ తర్వాత మెల్లగా ఆమె సినిమాలు రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో ఉండడంతో స్థాయి పెరగలేదు. నిన్నటి వరకు కనీసం మిడిల్ రేంజ్ హీరోలతో కలిసి నటించిన ఆమె ఇప్పుడు అంతకంటే తక్కువ స్థాయి హీరోలతో సినిమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

అందుకే ఇప్పుడు స్పార్క్ అనే సినిమాతో సక్సెస్ అందుకునే ఫామ్ లోకి రావాలని అనుకుంటుంది. ఈ సినిమాలో కొత్త తరహా నటీనటులు నటిస్తున్నప్పటికీ కంటెంట్ మాత్రం బాగానే ప్రమోషన్స్ తో హైలైట్ చేస్తున్నారు. ఈ సినిమా ఏ మాత్రం క్లిక్ అయినా అమ్మడికి మళ్ళీ ఇండస్ట్రీలో అవకాశాల్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది.

అలాగే హన్సిక మోత్వాని నటించిన మై నేమ్ ఇజ్ శృతి కూడా ఈ వారం విడుదల కాబోతోంది. ఈ సినిమాపై హన్సిక చాలా ఆశలు పెట్టుకుంది. ఒకప్పుడు పెద్ద సినిమాల్లో కూడా నటించిన ఈ బ్యూటీ సక్సెస్ లేక సతమతమవుతోంది. కాబట్టి ఈ శుక్రవారం రాబోతున్న ఈ సినిమా కూడా ఆమెకు చాలా కీలకం. ఇక రక్షిత్ శెట్టి డబ్బింగ్ చిత్రం "సప్త సాగరాలు దాటి సైడ్-బి" ఈ వారం విడుదల అవుతోంది. హీరోయిన్ రుక్మిణి వసంత్‌కి కన్నడ పరిశ్రమలో ప్రాముఖ్యత పొందిన తర్వాత తెలుగు సినిమాలో కూడా అవకాశాలు అందుకునేలా సక్సెస్ చూడాలని అనుకుంటోంది. మరి ఈ వారం ఏ హీరోయిన్ ఎక్కువ స్థాయిలో సక్సెస్ అందుకుంటుందో చూడాలి.