Begin typing your search above and press return to search.

సీనియర్ జూనియర్ తేడా చూపించట్లేదు..!

యువ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా సీనియర్ స్టార్స్ కూడా తమ ఫుల్ ఎఫర్ట్ పెట్టేస్తున్నారు

By:  Tupaki Desk   |   15 April 2024 7:30 AM GMT
సీనియర్ జూనియర్ తేడా చూపించట్లేదు..!
X

యువ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా సీనియర్ స్టార్స్ కూడా తమ ఫుల్ ఎఫర్ట్ పెట్టేస్తున్నారు. 100 సినిమాలకు అటుఇటుగా తీసి కోట్ల మంది అభిమానులను సంపాదించిన సీనియర్ స్టార్స్ చూడని రికార్డులు, అందుకోని అవార్డులు లేవు. అలా అని రిలాక్స్ అవ్వకుండా యువ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నారు. అయితే మొన్నటిదాకా సీనియర్ హీరోలతో అంటే హీరోయిన్స్ అంతా కాస్త ఆలోచించే వారు. ఒక్కసారి సీనియర్ హీరోలతో చేస్తే కెరీర్ అయిపోయినట్టే అన్న భావనలో ఉండేవారు.

కానీ ఇప్పుడు ఆ పంథా మారింది. సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా హీరోయిన్స్ అంతా కూడా సినిమా ఛాన్స్ వచ్చింది అంటే దానికి ఓకే చెప్పేస్తున్నారు. కొందరు భామలు సీనియర్స్ తో చేస్తే కెరీర్ రిస్క్ లో పడుతుందని అనుకుంటారు. కానీ ఇప్పుడు సీనియర్ స్టార్స్ తో నటించేందుకు కథానాయికలు ఆసక్తి చూపిస్తున్నారు. సీనియర్ స్టార్స్ తో నటించినా తమ పాత్ర వరకు తాము న్యాయం చేస్తే స్టార్ క్రేజ్ తెచ్చుకోవచ్చనే ఆలోచనలో ఉన్నారు హీరోయిన్స్.

ఓ పక్క జూనియర్స్ అంటే యువ హీరోలతో జత కడుతూనే మరోపక్క సీనియర్స్ తో కలిసి నటించేందుకు రెడీ అవుతున్నారు. సీనియర్ జూనియర్స్ అనే తేడా లేకుండా భామలు వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకుంటున్నారు. సెట్స్ మీద ఉన్న సినిమాల్లో బాలకృష్ణ సరసన శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తుండగా వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ఓకే అనేసింది. ఆల్రెడీ నాగార్జునతో నా సామిరంగ సినిమాలో తన సత్తా చాటింది ఆషిక రంగనాథ్.

ఇలా సీనియర్స్ తో జత కట్టి వారి ఇమేజ్ మరింత పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయినా సినిమా అంటే అది చిన్నదైనా పెద్దదైనా ఒకే ఇంపాక్ట్ ఏర్పరుస్తుంది. తమకు వచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేస్తే అది ఎలాంటి హీరో సినిమా అయినా హీరోయిన్స్ కు బలంగా మారుతుంది. సో అందుకే సీనియర్స్ తో సినిమా అంటే భయపడి కాదనే పరిస్థితి నుంచి కావాలని సీనియర్ హీరోలతో జత కట్టే పరిస్థితి వచ్చింది. సో హీరోయిన్స్ అంతా కూడా ఇలానే కంటెంట్ చూడాలే తప్ప కాంబినేషన్ గురించి అంతగా పట్టించుకోకపోతే వారి కెరీర్ కు హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.