Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఈ విర‌హాగ్ని ఏమిటో మీనాక్షి?

ఈ విర‌హం దేనికో మీనాక్షి? ఇంత‌లోనే అంత‌గా చెల‌రేగిందేమిటో! అంటూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తోంది యూత్

By:  Tupaki Desk   |   19 May 2024 5:59 AM GMT
ఫోటో స్టోరి: ఈ విర‌హాగ్ని ఏమిటో మీనాక్షి?
X

ఈ విర‌హం దేనికో మీనాక్షి? ఇంత‌లోనే అంత‌గా చెల‌రేగిందేమిటో! అంటూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తోంది యూత్. కాన్సెప్ట్ ఏదైనా కానీ తెలుగు హీరోయిన్ మీనాక్షి చౌద‌రి లేటెస్ట్ ఫోటోషూట్ మ‌తులు చెడ‌గొడుతోంది. సోష‌ల్ మీడియాల్లో ఇత‌ర భామ‌ల‌కు ధీటుగా మీనాక్షి ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ వేడి పెంచుతూనే ఉంది. వీటిలో తాజా ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.

ఇది డార్క్ థీమ్ నేప‌థ్యంలోని స్పెష‌ల్ ఫోటోషూట్. మీనాక్షి బ్లాక్ టాప్- మిడ్డీలో ఎంతో అందంగా క‌నిపిస్తోంది. ఎంపిక చేసుకున్న డిజైన‌ర్ డ్రెస్ కి త‌గ్గ‌ట్టే బాబ్డ్ హెయిర్ స్టైల్.. మినిమ‌ల్ మేక‌ప్ తో మీనాక్షి సంథింగ్ స్పెష‌ల్ గా ఎలివేట్ అయింది. ఈ ఫోటోషూట్ కోసం మీనాక్షి ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఇది ఇంట‌ర్నెట్ ని బ్రేక్ చేస్తోంది. మీనాక్షి సంథింగ్ స్పెష‌ల్ గా ఉందంటూ తాజా ఫోటోషూట్ పై అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. గుంటూరు కారం త‌ర్వాత మీనాక్షి చౌద‌రి న‌టిస్తున్న మ‌రో భారీ బ‌డ్జెట్ చిత్రం -గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ద‌ళ‌ప‌తి విజ‌య్ స‌ర‌స‌న మీనాక్షి అద్భుత అవ‌కాశాన్ని అందుకుంది. ఇంత‌కుముందు మీనాక్షి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా గోట్ టీమ్ స్పెష‌ల్ గా విషెస్ తెలిపింది. దీనికి మీనాక్షి ఎంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌యింది. ఈ చిత్రంలో త‌న పాత్ర‌కు న‌ట‌న‌కు ఆస్కారం ఉంద‌ని కూడా చెబుతోంది. వెంక‌ట్ ప్ర‌భు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ల‌క్కీ భాస్క‌ర్, సింగ‌పూర్ సెలూన్, మ‌ట్కా, వీఎస్ 10 చిత్రాల్లో నటిస్తున్న మీనాక్షి మెగాస్టార్ చిరంజీవి విశ్వంభ‌ర లోను కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది.