Begin typing your search above and press return to search.

శ్రీలీలకు చెక్ పెడుతున్న అమ్మడు..!

శ్రీ లీల తర్వాత ఆమె రేంజ్ లో వరుస సినిమాలను అందుకుంటున్న మీనాక్షి ఫ్యూచర్ లో శ్రీ లీలకి టఫ్ ఫైట్ ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   30 July 2023 6:54 AM GMT
శ్రీలీలకు చెక్ పెడుతున్న అమ్మడు..!
X

కన్నడ భామ శ్రీ లీల తెలుగులో ఒకేసారి ఏడు ఎనిమిది సినిమాలతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. రవితేజ ధమాకాతో హిట్ అందుకున్న అమ్మడు ఆ తర్వాత స్టార్ ఛాన్స్ లు అందుకుంది. పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, మహేష్ తో గుంటూరు కారం ఇలా స్టార్స్ తో పాటుగా రామ్ తో స్కంద, వైష్ణవ్ తేజ్ తో ఆదికేశవ సినిమాలు చేస్తుంది. ఇవి కాకుండా విజయ్ దేవరకొండ, నితిన్ సినిమాల్లో కూడా ఛాన్స్ అందుకుంది శ్రీ లీల. రాబోయే ఏడాది మొత్తం శ్రీ లీల సినిమాలే ప్రేక్షకులను అలరించనున్నాయి.

టాలీవుడ్ లో నెక్స్ట్ స్టార్ హీరోయిన్ శ్రీ లీల అనేలా క్రేజ్ తెచ్చుకుంది. అయితే శ్రీ లీల తర్వాత ఆమెకి చెక్ పెట్టేందుకు రెడీ అవుతుంది మరో అందాల భామ మీనాక్షి చౌదరి. సుశాంత్ తో నటించిన ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అమ్మడు హిట్ 2, గుంటూరు కారం సినిమాలు చేస్తుంది. ఈ సినిమాలతో పాటుగా లేటెస్ట్ గా వరుణ్ తేజ్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ మట్కా సినిమాను కూడా అమ్మడు చేజిక్కించుకుంది. శ్రీ లీల తర్వాత ఆమె రేంజ్ లో వరుస సినిమాలను అందుకుంటున్న మీనాక్షి ఫ్యూచర్ లో శ్రీ లీలకి టఫ్ ఫైట్ ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

శ్రీ లీల ఇప్పటికే 8 సినిమాలు చేతిలో ఉండగా మీనాక్షికి నాలుగు సినిమాలు ఉన్నాయి. సీనియర్ హీరోయిన్స్ అంతా కూడా తమ పంథాలో సినిమాలు చేస్తుండగా కొత్త హీరోయిన్స్ మాత్రం తమ టాలెంట్ తో క్రేజీ ఛాన్స్ లు అందుకుంటున్నారు. రాబోయే రోజుల్లో స్టార్ సినిమా అంటే అయితే శ్రీ లీల లేదంటే మీనాక్షి చేయాలి అనేలా వీరిద్దరు క్రేజ్ తెచ్చుకుంటారని చెప్పొచ్చు.

శ్రీ లీల వర్సెస్ మీనాక్షి ఈ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ జరిగేలా ఉంది. మీనాక్షి సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా ఆమె క్రేజ్ ని డబుల్ చేస్తుంది. శ్రీ లీల తన సూపర్ టాలెంట్ తో దూసుకెళ్తుంది. మరి టాలీవుడ్ ని ఏలడానికి రెడీ అవుతున్న ఈ ఇద్దరు హీరోయిన్స్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి. తెలుగు సినిమాల్లో కొన్నాళ్ల పాటుగా శ్రీ లీల మీనాక్షిల పేర్లు వినబడేలా ఉన్నాయి. చేస్తున్న సినిమాలు హిట్ పడితే మాత్రం ఈ ఇద్దరి భామలను ఆపడం ఎవరి వల్లా కాదని చెప్పొచ్చు.