Begin typing your search above and press return to search.

వీడియో: మానుషి స్ట్రైకింగ్ కిల్లింగ్ లుక్స్

అక్షయ్ కుమార్ - మానుషి చిల్లర్ ఆన్-స్క్రీన్ జోడి చాలా మందికి ఆసక్తిని కలిగిస్తుంది. ఈ జంట తెర‌పై ఎబ్బెట్టుగా క‌నిపిస్తోంద‌ని విమ‌ర్శ‌లున్నాయి

By:  Tupaki Desk   |   16 March 2024 2:45 AM GMT
వీడియో: మానుషి స్ట్రైకింగ్ కిల్లింగ్ లుక్స్
X

అక్షయ్ కుమార్ - మానుషి చిల్లర్ ఆన్-స్క్రీన్ జోడి చాలా మందికి ఆసక్తిని కలిగిస్తుంది. ఈ జంట తెర‌పై ఎబ్బెట్టుగా క‌నిపిస్తోంద‌ని విమ‌ర్శ‌లున్నాయి. ఇంత‌కుముందే ఈ జంట‌పై పాట విడుదలైన వెంటనే నెటిజ‌నులు తమ అసమ్మతిని వ్యక్తం చేసారు. తనకంటే 30 ఏళ్లు చిన్నవాడైన మానుషితో రొమాన్స్ చేయడానికి అంగీకరించినందుకు నెటిజన్లు అక్షయ్ కుమార్‌పై విరుచుకుపడ్డారు. సూపర్ స్టార్ అక్ష‌య్ ని ఆన్‌లైన్‌లో విపరీతంగా ఎగతాళి చేసారు. అత‌డు ఆమెకు తండ్రిలా ఉన్నాడంటూ అక్కీని దెప్పి పొడిచారు.

బాలీవుడ్‌లో త‌క్కువ వ‌య‌సు హీరోయిన్ల‌తో రొమాన్స్ చేసే వాడిగా అక్షయ్ కుమార్ ని నిల‌దీస్తున్నారు నెటిజ‌నం. నిజ జీవితంలో అతని డౌన్-టు-ఎర్త్ వినయపూర్వకమైన స్వభావం కారణంగా భారీ అభిమానులను కలిగి ఉన్నాడు. అయితే అక్షయ్ తాజా ప్రాజెక్ట్ ల్లో హీరోయిన్ల ఎంపిక‌ చూశాక‌ అతడి ఎంపికల‌ను నెటిజ‌నులు తూర్పార‌బ‌డుతున్నారు.

బడే మియాన్ చోటే మియాన్ తాజా పాటలో అక్షయ్ కుమార్ మానుషి చిల్లర్ రొమాన్స్ ని యూత్ వ్య‌తిరేకిస్తున్నారు. ప్ర‌స్తుతం అక్ష‌య్, టైగర్ ష్రాఫ్, మానుషి చిల్లర్, ఆలయ ఎఫ్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ చిత్రం నుంచి పెప్పీ సాంగ్ వల్ల హబీబీ విడుదలైంది. ఇందులో ప్రధాన జోడీలు, అక్షయ్-మానుషి .. టైగర్- అలయ జంట‌లు హాట్ అవతార్‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు. నలుగురూ తమ డ్యాన్స్ మూవ్‌లను సెన్సావల్ ట్రాక్‌లో అద‌ర‌గొట్టారు. అయితే అక్షయ్ -మానుషి మ‌ధ్య కెమిస్ట్రీ కోఆర్డినేషన్ దృష్టిని ఆకర్షించింది. ఈ జంట‌ గతంలో సామ్రాట్ పృథ్వీరాజ్ చిత్రంలో క‌లిసి న‌టించారు. అయితే 30 ఏళ్ల చిన్న వయసులో ఉన్న మానుషి చిల్లర్‌తో రొమాన్స్ చేసినందుకు నెటిజన్లు అక్షయ్ కుమార్‌ను నెటిజ‌నులు నిందిస్తూనే ఉన్నారు. ఇది సిగ్గుచేటు అని కొంద‌రు వ్యాఖ్యానించారు.

ఆన్ లొకేష‌న్ కెమెరా మూవ్ మెంట్:

మ‌రోవైపు మానుషి చిల్ల‌ర్ కి బాలీవుడ్ లో ల‌క్ చిక్క‌లేదు. త‌న‌ని తాను నిరూపించుకునేందుకు ఈ అందాల రాణి చాలా కాలంగా ప్ర‌య‌త్నిస్తూనే ఉంది. ఇప్పుడు బ‌డే మియాన్ చోటే మియాన్ పై చాలా హోప్స్ పెట్టుకుంది. సోష‌ల్ మీడియాల్లో వీలున్నంత వ‌ర‌కూ త‌న‌వంతు ప్ర‌చారం చేస్తూనే ఉంది. తాజాగా ఆన్ లొకేష‌న్ విజువ‌లైజేష‌న్ కి సంబంధించిన ఒక ఆస‌క్తిక‌ర వీడియోని మానుషి షేర్ చేసింది. ఇది అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.