Begin typing your search above and press return to search.

తెలుగు డైరెక్ట‌ర్ ముద్దు కాదు పెక్ ఇచ్చాడ‌ట‌

ఈ ఎపిసోడ్ లో తెలుగు హీరోయిన్ పేరు మన్నారా చోప్రా. తన దర్శకుడు ఏఎస్ రవి కుమార్ బలవంతంగా చెంపపై ముద్దుపెట్టుకున్న ఫోటోలు వీడియోలు అప్ప‌ట్లో వైర‌ల్ అయ్యాయి

By:  Tupaki Desk   |   16 Oct 2023 8:24 AM GMT
తెలుగు డైరెక్ట‌ర్ ముద్దు కాదు పెక్ ఇచ్చాడ‌ట‌
X

మీడియా, టీవీ చానెళ్ల లైవ్ లోనే ఆమె బుగ్గ‌పై ముద్దిచ్చాడు.. అది కూడా బ‌ల‌వంతంగా... ఆ త‌ర్వాత ఆ హీరోయిన్ గురించి.. ఆ డైరెక్ట‌ర్ గురించి సోష‌ల్ మీడియాల్లో బోలెడంత ర‌చ్చ సాగింది. అయితే దానికి ఆ హీరోయిన్ ఇచ్చిన వివ‌ర‌ణ నిర్ఘాంత‌ప‌రిచింది. ''అత‌డు న‌న్ను ఒక బేబీగా భావించి ముద్దు పెట్టాడు. ప్ర‌జ‌ల‌కు వేరే ప‌నేమీ లేదు!'' అని కొట్టి పారేసింది.

ఈ ఎపిసోడ్ లో తెలుగు హీరోయిన్ పేరు మన్నారా చోప్రా. తన దర్శకుడు ఏఎస్ రవి కుమార్ బలవంతంగా చెంపపై ముద్దుపెట్టుకున్న ఫోటోలు వీడియోలు అప్ప‌ట్లో వైర‌ల్ అయ్యాయి. 'తిరగబడరా సామి' ప్రారంభోత్సవం సందర్భంగా ఈ సంఘటన జరిగింది. ఈ వీడియో వైరల్‌గా మారి వివాదానికి కారణమైంది. మన్నారా చోప్రా తరువాత ఆ దర్శకుడిని సమర్థించింది. త‌న‌పై అత‌డికి ఎటువంటి చెడు ఉద్దేశాలు లేవని చాలా కాలంగా తామిద్ద‌రం ఒక‌రికొక‌రు తెలుసున‌ని చెప్పింది.

ఇప్పుడు స‌ల్మాన్ ఖాన్ హోస్టింగ్ చేస్తున్న బిగ్ బాస్ 17 (హిందీ) ఇంటి స‌భ్యురాలిగా చేరిన మ‌న్నారా చోప్రా ఈ ముద్దు వ్య‌వ‌హారంపై మ‌రోసారి ముచ్చ‌టించింది. బిగ్ బాస్ 17 షోలోకి ప్రవేశించిన మొదటి కంటెస్టెంట్ మన్నారా చోప్రా. సల్మాన్ ఖాన్‌తో సరదా చాట్ సెష‌న్ లో పాల్గొంది. దీనిపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్య‌క్త‌మ‌య్యాయి. మ‌న్నారా... ప్రియాంక చోప్రా కజిన్. 'బిగ్ బాస్' షోలోకి చార్ట్ బ‌స్ట‌ర్ 'సామీ సామి..' పాటతో ఎంట్రీ ఇచ్చింది. తన దర్శకుడు తనను ప‌బ్లిక్ వేదిక‌పై ముద్దుపెట్టుకున్న వివాదం గురించి ఇదే సంద‌ర్భంలో సల్మాన్ ఖాన్‌తో మాట్లాడింది. మన్నారా చోప్రా తన దర్శకుడు కె.ఎస్.ర‌వికుమార్ చాలా కాలం తర్వాత తనను చూసాడ‌ని, ఎదిగిన పసిపాపను ఆప్యాయంగా ముద్దు(పెక్)పెట్టుకున్నాడు అని తెలిపింది. ప్రజలకు ప‌నేమీ లేద‌ని, అందుకే ఇలా ప్ర‌చారం చేస్తున్నార‌ని మ‌న్నారా అన్నారు. మన్నారా చోప్రా సల్మాన్ ఖాన్‌కి సెలూన్ సేవలు కావాలని చెప్ప‌డం ఇర్రిటేట్ చేసింది. ఈ కోరిక విన్న అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బిగ్ బాస్ ఇంట్లో ప్ర‌వేశించే వేళ సామీ సామీ సాంగ్ తో పాటు.. సల్మాన్ -ప్రియాంక చోప్రా జంట చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్ 'లాల్ దుపట్టా..'కు కూడా మ‌న్నారా చోప్రా డ్యాన్స్ చేసింది. ఈ బ్యూటీ ఎంట్రీపై నెటిజన్లు ఇలా స్పందించారు. అలాగే ఇంటి నియమాలను వివరించే టాస్క్ మన్నారా చోప్రాకి ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఆమె తన కోసం ఇంటి లోప‌ల‌ విలాసవంతమైన చోటును ఎంచుకుంది. షోలో మ‌న్నారా ఎలా రాణిస్తుందో చూడాలి! ప్ర‌స్తుతం మ‌న్నారా సినీకెరీర్ అంతంత మాత్ర‌మే. తాను ఆశించిన అవ‌కాశాలైతే లేవు. ఇప్పుడు హిందీ బిగ్ బాస్ షో త‌న కెరీర్ కి ఎలా బూస్ట్ ఇస్తుందో వేచి చూడాలి.