Begin typing your search above and press return to search.

5 పదుల వయసులో పాతికేళ్ల పరువాలు

ఈ అమ్మడి ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూ ఉంటాయి. సాధరణంగా మూడు పదుల వయసు దాటిన వారు స్కిన్‌ షో చేస్తే అవసరమా అనిపిస్తుంది

By:  Tupaki Desk   |   5 Sep 2023 7:29 AM GMT
5 పదుల వయసులో పాతికేళ్ల పరువాలు
X

బాలీవుడ్‌ హాట్ స్టార్ మలైకా అరోరా ఈ మధ్య కాలంలో సినిమాల్లో నటించకున్నా, సిరీస్‌ ల్లో సందడి చేయకున్నా మరే కార్యక్రమాల్లో పాల్గొనక పోయినా కూడా ఎప్పటికప్పుడు మీడియాలో ఉంటూనే ఉంటుంది. ఆమె గురించి సోషల్‌ మీడియాలో ప్రధానంగా చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా మరోసారి ఈమె అందాల ఆరబోత ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.


అయిదు పదుల వయసుకు చేరువ అయినా కూడా మలైకా అరోరా పాతికేళ్ల అమ్మాయి మాదిరిగా పరువాలు ఒలకబోస్తూ ఉండటం ఎంతో మంది యంగ్ హీరోయిన్స్ కు ఆదర్శం అనడంలో సందేహం లేదు. ఆమె రెగ్యులర్ గా వర్కౌట్‌ లు చేయడంతో పాటు, ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని ఆమె సన్నిహితులు అంటూ ఉంటారు.

మలైకా అరోరా పలు సినిమాల్లో ప్రత్యేక పాటల్లో కనిపించింది. నటిగా కూడా ఎంతో గుర్తింపు దక్కించుకున్న మలైకా ప్రస్తుతం బాలీవుడ్‌ యంగ్‌ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ లో ఉందనే వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య అర్బాజ్ ఖాన్‌ కి విడాకులు ఇచ్చిన తర్వాత వెంటనే వివాహం చేసుకుంటుందని భావించారు.

ఈ అమ్మడి ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూ ఉంటాయి. సాధరణంగా మూడు పదుల వయసు దాటిన వారు స్కిన్‌ షో చేస్తే అవసరమా అనిపిస్తుంది. నాలుగు పదుల వయసు దాటిన వారు స్కిన్‌ షో చేస్తే బాబోయ్ ఏంటి ఈ దారుణం అన్నట్లుగా కామెంట్స్ చేసే వారు ఉన్నారు.

కానీ అయిదు పదుల వయసుకు వచ్చిన మలైకా స్కిన్‌ షో చేస్తే పాతికేళ్ల పడుచు అమ్మాయిల ఫోటోల మాదిరిగా నెటిజన్స్ తెగ చూస్తారు, అంతే కాకుండా తెగ లైక్ చేసి షేర్‌ చేసుకుంటూ ఉంటారు. ఇంకో పదేళ్ల పాటు ఇదే అందంతో మలైకా అభిమానులను అలరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.