Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: న‌ట‌వార‌సురాళ్ల ప్రేమ‌క‌థ‌లు

బాలీవుడ్ లో వ‌రుస ప్రేమ‌క‌థ‌లు వేడి పుట్టిస్తున్నాయి. న‌ట‌వార‌సురాళ్లు త‌మ‌కు న‌చ్చిన స‌రిజోడును వెతుకుతూ కెమెరా క‌ళ్ల‌కు చిక్కుతున్నారు.

By:  Tupaki Desk   |   8 Nov 2023 10:40 AM GMT
టాప్ స్టోరి: న‌ట‌వార‌సురాళ్ల ప్రేమ‌క‌థ‌లు
X

బాలీవుడ్ లో వ‌రుస ప్రేమ‌క‌థ‌లు వేడి పుట్టిస్తున్నాయి. న‌ట‌వార‌సురాళ్లు త‌మ‌కు న‌చ్చిన స‌రిజోడును వెతుకుతూ కెమెరా క‌ళ్ల‌కు చిక్కుతున్నారు. ఇటీవ‌లి కాలంలో కింగ్ ఖాన్ షారూఖ్ కుమార్తె సుహానా, శ్రీ‌దేవి కుమార్తెలు జాన్వీ, ఖుషీ, ప్ర‌ముఖ హిందీ న‌టుడు చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే,స్టార్ హీరో సైఫ్ ఖాన్ కుమార్తె సారా అలీఖాన్, యువ‌నాయిక‌ బానిటా సంధు పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. వీరంతా త‌మ లైఫ్ పార్ట్ న‌ర్ ల‌ను వెతుక్కున్నార‌నేది ఇటీవ‌లి వార్తా క‌థ‌నాల సారాంశం.


కింగ్ ఖాన్ కుమార్తె సుహానాఖాన్ .. అమితాబ్ బ‌చ్చ‌న్ మ‌న‌వ‌డు అగ‌స్త్య నందాతో ప్రేమాయ‌ణం సాగిస్తోంద‌ని ఇటీవ‌ల క‌థ‌నాలొస్తున్నాయి. అగ‌స్త్య అమితాబ్ కుమార్తె శ్వేతానంద బ‌చ్చ‌న్ కుమారుడు. ఆ ఇద్ద‌రూ ఎంతో స‌న్నిహితంగా ఉన్నారు. డెబ్యూ సిరీస్ 'ది ఆర్చీస్' సెట్లో ఎంతో క‌లిసి మెలిసి ప‌ని చేసారు. అదే క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్యా ప్రేమ పుట్టింది. ఒక‌రిని విడిచి ఒక‌రు ఒక్క క్ష‌ణ‌మైనా ఉండ‌లేక‌పోతున్నారంటూ ప్ర‌చారం సాగుతోంది.


సుహానా కంటే ముందు నుంచే జాన్వీ క‌పూర్ ప్రేమాయ‌ణం గురించి పుకార్ ఉంది. మాజీ మ‌హారాష్ట్ర‌ ముఖ్య‌మంత్రి సుశీల్ కుమార్ షిండే మ‌న‌వ‌డు శిఖ‌ర్ ప‌హారియాతో జాన్వీ క‌పూర్ నిండా ప్రేమ‌లో మునిగింద‌ని, ఆ ఇద్ద‌రినీ ప‌లుమార్లు స‌న్నిహితంగా చూసిన వారు చెబుతున్నారు. ఇటీవ‌ల ప‌లు ఈవెంట్లోను ఈ జంట అంద‌రి క‌ళ్లలో ప‌డ‌టంతో రూమ‌ర్ మ‌రింత బ‌ల‌ప‌డింది. జాన్వీ సోద‌రి ఖుషీక‌పూర్ - వేదాంగ్ రైనాతో ప్రేమాయణం సాగిస్తోంద‌ని ప్ర‌చారం సాగింది. ప‌లుమార్లు ఈ జంట ఫోటోలు వైర‌ల్ కావ‌డంతో ఈ పుకార్ నిజ‌మేనంటూ ప్ర‌చారం హోరెత్తింది.


న‌టుడు చంకీ పాండే కుమార్తె అన‌న్య పాండే- హీరో ఆదిత్యారాయ్ క‌పూర్ తో ప్రేమాయ‌ణం సాగిస్తోంద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ఈ జంట విదేశీ విహార‌యాత్ర‌ల‌కు వెళ్ల‌డంతో డేటింగ్ ని క‌న్ఫామ్ చేసారు. అలాగే సైఫ్ అలీఖాన్ న‌ట‌వార‌సురాలు సారా అలీఖాన్ - హీరో కార్తీక్ ఆర్య‌న్ తో ప్రేమాయ‌ణం సాగిస్తోందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. సారా త‌న తొలి చిత్రం కేధార్‌నాథ్ క‌థానాయ‌కుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో డేటింగ్ చేసాన‌ని అంగీక‌రించింది. ఆ త‌ర్వాత కార్తీక్ తోను ఈ బ్యూటీ ప్రేమాయ‌ణం న‌డిపించ‌డం హాట్ టాపిక్ అయింది.


అయితే దీనిపై వంద‌శాతం క్లారిటీ రాలేదు. పాపుల‌ర్ ఆంగ్లో ఇండియ‌న్ బిజినెస్ ఫ్యామిలీలో జ‌న్మించిన బానిటా సంధు - గాయ‌కుడు ఏపీ థిల్లాన్ తో నిండా ప్రేమ‌లో ఉంద‌ని ప్ర‌చారం సాగుతోంది. బానిట అక్టోబ‌ర్ అనే సినిమాతో వ‌రుణ్ ధావ‌న్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా ప‌రిచ‌యం అయింది. ఆ త‌ర్వాత త‌మిళంలో చియాన్ విక్ర‌మ్ కుమారుడు ధృవ్ స‌ర‌స‌న ఆర్జున్ రెడ్డి రీమేక్ లో న‌టించింది.