Begin typing your search above and press return to search.

'తమ్ముడు' తో లయ రీఎంట్రీ

తమ్ముడు అనే టైటిల్ తో రాబోతుంది అంటూ ఈ సినిమాలో అక్కగా లయ పాత్రకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు

By:  Tupaki Desk   |   31 Aug 2023 4:10 AM GMT
తమ్ముడు తో లయ రీఎంట్రీ
X

టాలీవుడ్‌ లో ఉత్తరాది ముద్దుగుమ్మల హవా కొనసాగుతున్న సమయంలో తెలుగు అమ్మాయి లయ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్‌ గా వెలుగు వెలిగిన విషయం తెల్సిందే. స్టార్‌ హీరోలకు జోడీగా నటించి మెప్పించిన లయ తక్కువ సమయంలో స్టార్‌ హీరోయిన్‌ గా పేరు దక్కించుకుంది.

ఎంత స్పీడ్ గా స్టార్‌ డం దక్కించుకుందో అంతే స్పీడ్‌ గా ఆమె డౌన్ అయింది. సినిమా ల్లో ఆఫర్లు తగ్గిన వెంటనే అమెరికాకు చెందిన డాక్టర్ ను పెళ్లి చేసుకున్న లయ ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయింది. ఈ మధ్య కాలంలో లయ సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది. పిల్లలు పెద్ద వారు అవ్వడంతో లయ మళ్లీ సినిమాలపై ఆసక్తి కనబర్చుతుందనే వార్తలు వచ్చాయి.

ఆ మధ్య లయ ఒక ఇంటర్వ్యూలో మంచి ఆఫర్లు వస్తే తప్పకుండా నటిస్తానంటూ చెప్పుకొచ్చింది. అన్నట్లుగానే తాజాగా ఒక తెలుగు సినిమాకు కమిట్ అయిందనే వార్తలు వస్తున్నాయి. నితిన్‌ నటించబోతున్న తమ్ముడు అనే సినిమాలో అక్క పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. అందుకే లయ రీ ఎంట్రీకి నితిన్‌ సినిమా ను ఎంపిక చేసుకుంది.

తమ్ముడు అనే టైటిల్ తో రాబోతుంది అంటూ ఈ సినిమాలో అక్కగా లయ పాత్రకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న లయ రీ ఎంట్రీ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించబోతున్న నేపథ్యంలో ఎలాంటి పాత్రలు ముందు ముందు ఈమె చేయబోతుంది, ప్రేక్షకులు ఎంతగా ఆధరిస్తారు అనేది చూడాలి.