Begin typing your search above and press return to search.

పొట్టి గౌనులో కుషిత మైండ్ బ్లాక్ హొయలు

ఈ మధ్యకాలంలో తెలుగమ్మాయిలు కూడా గ్లామర్ షో విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా హీటెక్కించే డ్రెస్సులుతో సందడి చేస్తున్నారు

By:  Tupaki Desk   |   14 May 2024 1:35 PM GMT
పొట్టి గౌనులో కుషిత మైండ్ బ్లాక్ హొయలు
X

ఈ మధ్యకాలంలో తెలుగమ్మాయిలు కూడా గ్లామర్ షో విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా హీటెక్కించే డ్రెస్సులుతో సందడి చేస్తున్నారు. సినిమా అవకాశాలు తక్కువగానే ఉన్న ఇన్ స్టాగ్రామ్ లో అందాల ప్రదర్శన చేస్తూ విపరీతంగా ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు. మోడలింగ్, షార్ట్ ఫిలిమ్స్, యు ట్యూబ్ వెబ్ సిరీస్ లతో కెరియర్ స్టార్ట్ చేస్తోన్న అందాల భామలు తక్కువ టైమ్ లోనే హీరోయిన్ రేంజ్ గుర్తింపుని సోషల్ మీడియా ద్వారా తెచ్చుకుంటున్నారు.

టాలీవుడ్ లోకి అరంగేట్రం చేసి ఒక్కో అవకాశం సొంతం చేసుకుంటూ తమ ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. గ్లామర్ క్యారెక్టర్స్ అంటే ఒకప్పుడు బాలీవుడ్ భామలవైపే చూసేవారు. మేము కూడా గ్లామర్ రోల్స్ కి సై అంటూ వర్ధమాన తెలుగు హీరోయిన్స్ దర్శక, నిర్మాతలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. దీంతో ఈ బ్యూటీస్ కి మన దర్శకులు అవకాశాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు.

టాలీవుడ్ లో అందాల భామ కుషిత కల్లపు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడుకి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. యుట్యూబ్ వెబ్ సిరీస్ లతో ఈ బ్యూటీ నటిగా కెరియర్ స్టార్ట్ చేసింది. మెల్లగా ఇమేజ్ పెంచుకుంటూ వెస్ట్రన్ అవుట్ ఫిట్ లతో ఇన్ స్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫోటోషూట్ లతో విశేషమైన పాపులారిటీ సొంతం చేసుకుంది.

కుషిత చాంగురే బంగారురాజా మూవీతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తరువాత మనోహరం, నీతోనే నేను సినిమాలలో హీరోయిన్ గా కనిపించింది. బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన బాబు నెంబర్ వన్ బుల్ షిట్ మూవీలో సినిమాలో హీరోయిన్ గా కుషిత కల్లపు నటించింది. హీరోయిన్ గా ఈ బ్యూటీ ప్రస్తుతం బాగానే అవకాశాలు సొంతం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఈ అమ్మడు గ్లామరస్ షార్ట్ వీడియోని షేర్ చేసింది.

అందులో పొట్టి గౌనులో థైస్ అందాలు చూపిస్తూ అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్ తో కుర్రాళ్ళకి నిద్రలేకుండా చేస్తోంది. ఈ షార్ట్ స్కర్ట్ లో కుషిత కొలనులో హంసలా ఉందనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ స్థాయిలో గ్లామర్ షో చేస్తే దర్శక నిర్మాతలు పిలిచి అవకాశాలు ఇస్తారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.