Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : అందాల గులాబి అదరహో

హీరోయిన్ గా ఈ అమ్మడు తెలుగు లో కంటే ఎక్కువగా హిందీ సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు

By:  Tupaki Desk   |   25 Jan 2024 3:45 AM GMT
పిక్ టాక్ : అందాల గులాబి అదరహో
X

మహేష్ బాబుకు జోడీగా '1 నేనొక్కడినే' సినిమాలో నటించిన ముద్దుగుమ్మ కృతి సనన్‌. తెలుగు లో ఎంట్రీ ఇచ్చినా, కెరీర్ ఆరంభంలో తెలుగు లో సినిమాలు చేసిన ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ ముద్దుగుమ్మ. ఈ అమ్మడు చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు ఆదిపురుష్ సినిమాతో వచ్చిన విషయం తెల్సిందే.


హీరోయిన్ గా ఈ అమ్మడు తెలుగు లో కంటే ఎక్కువగా హిందీ సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆమె కూడా సౌత్ ఆఫర్లను సున్నితంగా తిరష్కరిస్తూ వస్తుంది. ఇక ఈ అమ్మడి సోషల్‌ మీడియా పిక్స్ మరియు వీడియోలు మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేస్తూనే ఉన్నాయి.


తాజాగా మరోసారి గులాబి డ్రెస్‌ లుక్ లో అదరగొట్టింది. డ్రెస్ కోడ్‌ గులాబ్‌ అంటూ ఈ ఫోటోలకు కామెంట్‌ పెట్టి కృతి సనన్ ఈ ఫోటోలను షేర్‌ చేసింది. రెగ్యులర్‌ గా తన స్కిన్‌ షో చేసే ఈమె ఈసారి పెద్దగా స్కిన్‌ షో చేయకున్నా కూడా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఆకట్టుకునే రూపం ఈ అమ్మడి సొంతం అంటూ పలు సందర్భాల్లో నిరూపితం అయింది. మరోసారి ఈమె లుక్ కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. అందాల గులాబి కి నెటిజన్స్ అదరహో అంటూ కితాబిస్తున్నారు. ఇలాంటి అందగత్తెకు టాలీవుడ్ లో హిట్ పడక పోవడం విడ్డూరంగా ఉందని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.