Begin typing your search above and press return to search.

గోల్డ్ డిజైన్ లో సీత‌మ్మ మెరిసిపోతుందే!

అంత ల‌క్కీ కాక‌పోతే వ‌న్ ప్లాప్ అయినా...ప‌నిగట్టుకుని ప్ర‌భాస్ స‌ర‌స‌న ఆదిపురుష్ లో ఎంపికైంది? అంటే ఇంకేమ‌నాలి

By:  Tupaki Desk   |   14 Dec 2023 8:20 AM GMT
గోల్డ్ డిజైన్ లో సీత‌మ్మ మెరిసిపోతుందే!
X

ఢిల్లీ బ్యూటీ కృతిస‌న‌న్ కి టాలీవుడ్ క‌లిసిరాక‌పోయినా బాలీవుడ్ మాత్రం క‌లిసొచ్చింది. ఎన్నో అంచ నాలు...ఆశ‌లతో తెలుగు లో లాంచ్ అయినా అవ‌న్నీ ఇక్క‌డ ఆవిరిగానే మిగిలిపోయాయి. డెబ్యూ 'వ‌న్ నేనొక్కిడినే' స‌హా రీసెంట్ గా రిలీజ్ అయిన 'ఆదిపురుష్' కూడా అలాంటి అనుభ‌వాన్నే మిగిల్చింది. సాధార‌ణంగా ఇలాంటి పెద్ద చిత్రాల్లో అవ‌కాశం రావ‌డం అన్న‌దే అరుదు. కానీ ఆ విష‌యంలో కృతిస‌న‌న్ ఎంతో ల‌క్కీ.


అంత ల‌క్కీ కాక‌పోతే వ‌న్ ప్లాప్ అయినా...ప‌నిగట్టుకుని ప్ర‌భాస్ స‌ర‌స‌న ఆదిపురుష్ లో ఎంపికైంది? అంటే ఇంకేమ‌నాలి. కానీ తాను ఒక‌ట‌నుకుంటే....మ‌రోలా జ‌రుగుతోంది. అయినా అమ్మ‌డిని బాలీవుడ్ మాత్రం ఆదుకుంటుంది. అక్క‌డ మాత్రం వ‌రుస‌గా సినిమాలు చేస్తూ బిజీ నాయిగా మారిపోయింది. ఈ మ‌ధ్యనే జాతీయ అవార్డు సైతం అందుకుని ఉత్త‌మ న‌టిగా నీరాజాన‌లు సొంతం చేసుకుంది.

టాలీవుడ్ లో ల‌క్ ఎంత‌గా క‌లిసి రాలేదో? బాలీవుడ్ లో మాత్రం అంత‌కు రెట్టింపు అదృష్టం క‌లిసొస్తు న్న‌ట్లే క‌నిపిస్తుంది. అందుకు జాతీయ అవార్డు కూడా కొన్ని సినిమాల‌కే కైవసం చేసుకుంది. ఇప్పుడు క‌థ‌ల విష‌యంలో మ‌రింత సెల‌క్టివ్ గా ఉంటుంది. ఓ సినిమా కి సైన్ చేయాలంటే ఒక‌టికి ప‌దిసార్లు పాత్ర ఎలా ఉంటుంది? ఒప్పుకున్న త‌ర్వాత పేరొస్తుందా? రాదా? ఇలా అన్ని విష‌యాలు ఆలోచించ‌కుని క‌మిట్ అవుతుంది.

ఇక సోష‌ల్ మీడియాలో కృతి స‌న‌న్ ఫాలోయింగ్ చెప్పాల్సిన ప‌నిలేదు. ఇన్ స్టాలో ఎప్ప‌టిక‌ప్పుడు టెం...గ్ ఫోటోల‌తో అల‌రిస్తూనే ఉంటుంది. తాజాగా హ‌లో క‌వ‌ర్ పేజీ కోసం అమ్మ‌డు మ‌రోసారి చెల‌రేగిన వైనం యువ‌త‌లో చ‌ర్చ‌కొస్తుంది. ఇదిగో ఇక్క‌డిలా గోల్డ్ క‌ల‌ర్ డిజైన్ దుస్తుల్లో చూప‌రుల‌ను ఆక‌ట్టుకుం టుంది. కృతిలో బ్యూటీని ఈ దుస్తులు మ‌రింత అందంగా తీర్చిదిద్దాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. అభిమానులు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.