Begin typing your search above and press return to search.

బ్లాక్ లుక్‌లో మైండ్ బ్లాక్ చేసిన కృతి

కృతి సనన్ ప‌రిచయం అవ‌స‌రం లేదు. టాలీవుడ్ లో మ‌హేష్‌- ప్ర‌భాస్- నాగ‌చైత‌న్య లాంటి క్రేజీ స్టార్ల స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించింది ఈ బ్యూటీ

By:  Tupaki Desk   |   29 Sep 2023 10:32 AM GMT
బ్లాక్ లుక్‌లో మైండ్ బ్లాక్ చేసిన కృతి
X

కృతి సనన్ ప‌రిచయం అవ‌స‌రం లేదు. టాలీవుడ్ లో మ‌హేష్‌- ప్ర‌భాస్- నాగ‌చైత‌న్య లాంటి క్రేజీ స్టార్ల స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించింది ఈ బ్యూటీ. 1 నేనొక్క‌డినే- ఆదిపురుష్- దోచేయ్ చిత్రాల‌లో అద్భుత న‌ట‌న‌తో యూనిక్ స్టార్ అని నిరూపించింది. కృతి ఇప్పుడు గ‌ణ‌ప‌త్ సినిమాతో అభిమానుల ముందుకు వ‌స్తోంది. ఈ చిత్రంలో టైగ‌ర్ ష్రాఫ్ క‌థానాయ‌కుడు. మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ గణపత్ టీజ‌ర్ ఇంత‌కుముందే విడుద‌లై అంత‌ర్జాలంలో దూసుకెళుతోంది. టైగ‌ర్- కృతి జంట‌ గతంలో హీరోపంతిలో స్క్రీన్‌ను షేర్ చేసుకున్నారు. ఈ జంట‌ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఎలక్ట్రిఫైయింగ్ అంటూ అభిమానులు కితాబిచ్చారు. ఇప్పుడు గ‌ణ‌ప‌త్ లో ఈ జంట పూర్తి యాక్ష‌న్ మోడ్ లో స్పెష‌ల్ గా క‌నిపిస్తోంది. ముఖ్యంగా కృతి స‌నోన్ నాన్ చాక్ తిప్పుతూ యాక్ష‌న్ క్వీన్ ని త‌ల‌పిస్తోంది. టీజ‌ర్ లో కృతి యాక్ష‌న్ బ్లాక్ మైండ్ బ్లాక్ చేసిందని చెప్పాలి.


ఇటీవ‌ల‌ గ‌ణ‌ప‌త్ ప్ర‌చారంలో బిజీ అయిపోయిన‌ కృతి సోష‌ల్ మీడియాల్లో వేడెక్కించే ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తోంది. తాజాగా మ‌రోసారి మైండ్ బ్లాక్ చేసే డిజైన‌ర్ లుక్ లో క‌నిపించింది. బ్లాక్ క‌ల‌ర్ థై స్లిట్ లెద‌ర్ కోట్ లో కిల్ల‌ర్ లేడీని త‌ల‌పిస్తోంది. తాజా ఫోటోషూట్ అంత‌ర్జాలాన్ని వేగంగా చుట్టేస్తోంది. న‌ట‌న ప‌రంగా త‌న‌దైన యూనిక్ నెస్ తో కృతి పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఆకట్టుకునే అందం.. అద్భుత‌ నటన.. ఫ్యాష‌న్ సెన్స్ తో కృతి ఎప్పుడూ యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారుతోంది. తాజా లుక్ అభిమానులను ఫ్యాషన్ ప్రియులను ఆశ్చర్యానికి గురి చేసింది. సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్‌లో కృతి అసాధార‌ణ‌ డ్రెస్సింగ్ సెన్స్‌ని చూసి మరోసారి ఆశ్చర్యపోయాం! అంటూ కామెంట్ చేస్తున్నారు. బ్లాక్ లెదర్ మిడి డ్రెస్‌లో చాలా స్పెష‌ల్ గా క‌నిపించిందంటూ కితాబిచ్చేస్తున్నారు. నిజానికి బ్లాక్ లుక్ అనేది ఎప్పుడూ ప్ర‌త్యేక‌మైన‌ది. వారాంతపు పార్టీకి వెళ్లాలనుకున్నా లేదా రెడ్ కార్పెట్ ఈవెంట్ కి సిద్ధమ‌వ్వాల‌న్నా బ్లాక్ లుక్ చాలా ప్ర‌త్యేకంగా ఉంటుందని ఫ్యాష‌న్ డిజైన‌ర్స్ సూచిస్తారు. నలుపు అనేది స్థిరంగా సురక్షితమైన ఎంపిక. కృతి ధ‌రించిన బ్లాక్ లెద‌ర్ డ్రెస్ ధర రూ. 63000.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. కృతి ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న ఆదిపురుష్ ఫ్లాపైన సంగ‌తి తెలిసిందే. దీంతో ఈ భామ చాలా నిరాశ‌ప‌డింది. ఇప్పుడు 'గణపత్: ఎ హీరో ఈజ్ బోర్న్'తో విజ‌యాన్ని ఖాతాలో వేసుకోవాల‌ని ఉవ్విళ్లూరుతోంది. వికాస్ బహ్ల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భారతీయ హిందీ-భాషా డిస్టోపియన్ యాక్షన్ చిత్రమిది. పూజా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ లో జాకీ భగ్నాని, వాషు భగ్నాని, దీప్శిఖా దేశ్‌ముఖ్‌లతో కలిసి గుడ్ కో బ్యాన‌ర్ లో నిర్మించారు. ఇందులో టైగర్ ష్రాఫ్ టైటిల్ పాత్రలో న‌టిస్తుండ‌గా, అమితాబ్ బచ్చన్, కృతి సనన్ కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 20న థియేటర్లలోకి రానుంది.