Begin typing your search above and press return to search.

ఉప్పెన పాపకు మరో క్యూట్ ఆఫర్

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ చివరగా ఒకే ఒక జీవితం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత శర్వానంద్ నుంచి ఏ సినిమా రాలేదు

By:  Tupaki Desk   |   21 Sep 2023 5:51 AM GMT
ఉప్పెన పాపకు మరో క్యూట్ ఆఫర్
X

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ చివరగా ఒకే ఒక జీవితం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత శర్వానంద్ నుంచి ఏ సినిమా రాలేదు. కాగా, ఆయన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా తీస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కాగా, తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ మూవీలో హీరోయిన్ ఎవరో రివీల్ చేశారు.

ఈ సినిమాలో శర్వానంద్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు వీరిద్దరి కాంబినేషన్ లో ఎలాంటి సినిమా రాలేదు. ఇదే మొదటి సినిమా. ఈరోజు కృతి పుట్టిన రోజు సందర్భంగా మూవీ టీమ్ ఈ విషయాన్ని ప్రకటించింది. కృతికి బర్త్ డే విషెస్ చెబుతూనే, ఆమె పోస్టర్ విడుదల చేశారు. ఈ రోజు 11గంటల 7 నిమిషాలకు మరో సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మరి ఆ సర్ ప్రైజ్ ఏంటో తెలియాలంటే, వారు చెప్పిన సమయం వరకు ఆగాల్సిందే.

కాగా, ఇది శర్వానంద్ 35వ సినిమా. ప్రస్తుతానికి మూవీకి టైటిల్ కూడా పెట్టలేదు. అయితే, ఈ సినిమాకి బేబీ ఆన్ బోర్డ్ అనే టైటిల్ పెట్టాలి అని అనుకుంటున్నారట. ఈ మూవీలో ఆయన తండ్రి పాత్రలో కనిపిస్తాడనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక సమాచారం అయితే లేదు.

చాలా కాలంగా శర్వానంద్, కృతి శెట్టి ఇద్దరూ ప్లాప్ లతో సతమతమౌతున్నారు. మరి, ఈ మూవీతో వీరిద్దరికీ హిట్ లభిస్తుందో లేదో చూడాలి, ఇక, డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య విషయానికి వస్తే, ఇప్పటి వరకు చాలా సినిమాలు చేశారు. నాగార్జున, నాని లాంటి స్టార్ హీరోలతో దేవ దాస్ సినిమా తీసింది ఈయనే. అదేవిధంగా , శమంతకమణి, భలే మంచి రోజు, హీరో వంటి సినిమాలు చేశారు. అయితే, ఇప్పటి వరకు ఈ సినిమాల్లో ఏదీ కమర్షియల్ హిట్ కాలేదు. అలా అని, మరీ తీసేసే సినిమాలు అయితే కావు. కానీ, అలా అని సూపర్ హిట్ అని కూడా చెప్పలేం.

ఇదిలా ఉండగా, శర్వానంద్ ఇటీవల పెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది మొదట్లో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఆయన, ఇటీవల పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు అయ్యాడు. జూన్3న జైపూర్‌ లోని లీలా ప్యాలెస్‌ లో రక్షితతో ఆయన పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది. తర్వాత హైదరాబాద్ లో రిసెప్షన్ కూడా నిర్వహించారు.