Begin typing your search above and press return to search.

వాడిని పెళ్లి చేసుకుని ఉంటే చంపేసేవాడేమో!

తెలుగు బిగ్ బాస్ ఏడవ సీజన్ లో సర్ప్రైజింగ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ముద్దుగుమ్మ కిరణ్ రాథోడ్‌

By:  Tupaki Desk   |   26 Sep 2023 4:37 AM GMT
వాడిని పెళ్లి చేసుకుని ఉంటే చంపేసేవాడేమో!
X

తెలుగు బిగ్ బాస్ ఏడవ సీజన్ లో సర్ప్రైజింగ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ముద్దుగుమ్మ కిరణ్ రాథోడ్‌. సీనియర్‌ ముద్దుగుమ్మ అయిన కిరణ్ రాథోడ్‌ మొదటి వారం పూర్తి అవ్వగానే ఎలిమినేట్‌ అయింది. దాంతో చాలా మంది ఆమె అభిమానులు మరియు సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు తెలుగు రాకపోవడం వల్లే ఎలిమినేట్ అయింది అనేది టాక్.

బిగ్ బాస్ కి అనవసరంగా వెళ్లాను అంటూ ఇప్పుడు కిరణ్ రాథోడ్‌ ఫీల్‌ అవుతుందట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ విషయాలను చెప్పుకొచ్చింది. తెలుగు బిగ్ బాస్‌ నుండి ఆఫర్‌ వచ్చిన సమయంలో నేను ఎక్కువ ఆలోచించకుండా ఓకే చెప్పాను. నేను కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉండాల్సింది అంటూ కిరణ్ రాథోడ్ అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఇంటర్వ్యూలో ఇంకా కిరణ్‌ రాథోడ్ మాట్లాడుతూ... సౌత్ లో మంచి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నా కూడా బాలీవుడ్‌ లో నాకు ఇబ్బందులు తప్పలేదు. అక్కడ ఒకటి రెండు సినిమాలకు అగ్రిమెంట్‌ కూడా పూర్తి అయిన తర్వాత కమిట్మెంట్ అడిగేవారు. రాత్రికి పార్టీకి వస్తావా అన్నట్లుగా ప్రశ్నించేవారు.

చేతిలో సినిమాలు లేకున్నా కూడా కమిట్మెంట్‌ అడిగితే నేను పలు సినిమాలను క్యాన్సిల్‌ చేసుకున్నాను. చాలా వరకు సినిమాల్లో నేను హాట్ గా ఉన్న పాత్రల్లో నటించాను. అందువల్ల నన్ను కొందరు తప్పుగా చూడటం మొదలు పెట్టాను. నేను పలు సార్లు కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డాను అంటూ కిరణ్ ఆవేదన వ్యక్తం చేసింది.

ఇక తాను రెండు సార్లు ప్రేమలో విఫలం అయినట్లుగా పేర్కొంది. మొదటి సారి ప్రేమలో పడ్డప్పుడు నాలుగు ఏళ్లు అతడితో కలిసి ప్రయాణించాను. ఆ తర్వాత అతడి నిజ స్వరూపం తెలిసింది. ఒక వేళ అతడిని నమ్మి నేను పెళ్లి చేసుకుని ఉంటే కచ్చితంగా అతడు నన్ను చంపేసి ఉండేవాడు అంటూ కిరణ్ పేర్కొంది. మళ్లీ ప్రేమలో పడ్డ తాను మరోసారి మోసపోయాను. ఇప్పుడు ప్రేమ పై ఆసక్తి లేదని కూడా చెప్పుకొచ్చింది.