Begin typing your search above and press return to search.

కీయరా స్టన్నింగ్ గ్లామర్.. బ్లాస్ట్ అయ్యేలా..

బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ కియారా అద్వానీ చాలా తక్కువ టైంలోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు అందుకుంది

By:  Tupaki Desk   |   11 March 2024 2:54 PM GMT
కీయరా స్టన్నింగ్ గ్లామర్.. బ్లాస్ట్ అయ్యేలా..
X

బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ కియారా అద్వానీ చాలా తక్కువ టైంలోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు అందుకుంది. కెరీర్ మొదట్లోనే ఈ బ్యూటీ చాలా తెలివిగా అడుగులు వేసింది. ఒకవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూనే మరొకవైపు టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోలతో అవకాశాలు అందుకుంది. మొదటగా ఆమె మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమా చేసింది.

ఆ సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినప్పటికీ కూడా మంచి క్రేజ్ అయితే దక్కింది. ఇక తర్వాత వచ్చిన వినయ విధేయ రామ పెద్దగా సక్సెస్ కాలేదు. అయినప్పటికీ కూడా అమ్మడికి మరోసారి రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ లో నటించే అవకాశం దొరికింది. ఇక కియారా అద్వానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్ గా అవకాశాలు రాబడుతోంది.

అమ్మడు ఎక్కడ కనిపించినా కూడా తన గ్లామర్ తోనే ఎట్రాక్ట్ చేస్తుంది. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. అమ్మడు స్టైలిష్ గౌనులో జీ సినిమా అవార్డ్స్ లో చాలా ఘాటుగా దర్శనమిచ్చింది. అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే కెమెరాలు అన్నీ కూడా ఆమె వైపుకే యూ టర్న్ తీసుకున్నాయి.

పక్కన ఎంతమంది సెలబ్రిటీలు ఉన్నా కూడా అక్కడ ఫోటోగ్రాఫర్ల ఫోకస్ మొత్తం కియారా అద్వానీపైనే పడిపోయింది. ఇక ఆమె ఎద అందాలతో మాత్రమే కాకుండా నడుము అందాలతో కూడా మాయ చేసేసింది అని చాలా కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఆమె నుంచి రెగ్యులర్ గా సినిమాలు వస్తున్నా రాకున్నా కూడా అందంతో మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లిస్టులో కనిపిస్తూనే ఉంటుంది.

ఇక ఈ బ్యూటీ సిద్ధార్థ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకునే విషయం తెలిసిందే. చాలా కాలం పాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట చివరికి డెస్టినేషన్ వెడ్డింగ్ తో షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఒకవైపు ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే మరొకవైపు సినిమా కెరీర్ ను కూడా సమానంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ తో పాటు హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందుతున్న వార్ 2 సినిమాలో కూడా మెయిన్ హీరోయిన్ గా కనిపించబోతోంది. అలాగే బాలీవుడ్ లో మరో రెండు ప్రాజెక్టులు చర్చలు దశలో ఉన్నాయి. మరి బ్యూటీ రాబోయే రోజుల్లో ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.