Begin typing your search above and press return to search.

చరణ్ హీరోయిన్‌ కి గూగుల్‌ లో నెం.1 హోదా

ఇండియన్స్ గూగుల్‌ ద్వారా కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తిని కనబర్చుతూ ఉంటారు. బాలీవుడ్‌ హీరోయిన్‌ కియారా అద్వానీ గురించి గూగుల్‌ లో ఎక్కువగా సెర్చ్‌ చేశారట

By:  Tupaki Desk   |   12 Dec 2023 6:35 AM GMT
చరణ్ హీరోయిన్‌ కి గూగుల్‌ లో నెం.1 హోదా
X

ప్రతి ఏడాది తరహాలోనే ఈ ఏడాది కూడా గూగుల్‌ అత్యధికంగా వెతకబడిన విషయాలు, నటీ నటులు, రాజకీయ నాయకులకు సంబంధించిన జాబితాలను ప్రకటించడం జరిగింది. ఇండియన్స్ గూగుల్‌ ద్వారా కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తిని కనబర్చుతూ ఉంటారు. బాలీవుడ్‌ హీరోయిన్‌ కియారా అద్వానీ గురించి గూగుల్‌ లో ఎక్కువగా సెర్చ్‌ చేశారట.

బాలీవుడ్‌ సీనియర్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకునే, ప్రియాంక చోప్రా, ఆలియా భట్‌, ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్‌ వంటి ఎంతో మంది స్టార్స్ ఉండగా కియారా అద్వానీ గురించి ఈ సారి ఎక్కువగా తెలుసుకునేందుకు ఇండియన్ నెటిజన్స్ ఆసక్తి చూపించారు. కియారా అద్వానీ పెళ్లి అయిన నేపథ్యంలో ఆమె పెళ్లి ఫోటోల కోసం గూగుల్‌ లో ఎక్కువ సెర్చ్ చేశారని తెలుస్తోంది.

కియారా అద్వానీ భర్త ఎవరు, ఆమె పెళ్లి ఎలా చేసుకుంది, ప్రేమ వ్యవహారంకు సంబంధించిన విషయాలు, ఆమె సినిమా కెరీర్‌ ఇలా ఎన్నో విషయాల గురించి ప్రేక్షకులు సెర్చ్‌ చేశారు. అందుకే కియారా అద్వానీ ఈ ఏడాది గూగుల్‌ లో ఎక్కువగా వెతకబడిన హీరోయిన్‌ జాబితాలో నెం.1 గా నిలిచింది.

ప్రస్తుతం బాలీవుడ్‌ లో వరుస సినిమాలు చేయడంతో పాటు తెలుగు లో కియారా అద్వానీ గేమ్‌ చేంజర్ సినిమాలో రామ్‌ చరణ్ కి జోడీగా నటిస్తున్న విషయం తెల్సిందే. గేమ్‌ చేంజర్‌ సినిమా కి శంకర్‌ దర్శకత్వం వహిస్తూ ఉండగా, దిల్‌ రాజు భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్‌ కి గేమ్‌ చేంజర్‌ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.