Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: కుర్ర బ్యూటీ గుండె గుభేల్

కేతిక శ‌ర్మ మోడ‌ల్ కం న‌టిగా ఎద‌గ‌క ముందే ప్రముఖ యూట్యూబర్ గా ఓ వెలుగు వెలిగింది. పాపుల‌ర్ డైలాగ్‌లు, పాటల రీమిక్స్ ల‌తో కేతిక యూత్ లో పాపుల‌రైంది

By:  Tupaki Desk   |   4 Oct 2023 5:11 AM GMT
ఫోటో స్టోరి: కుర్ర బ్యూటీ గుండె గుభేల్
X

వ‌రుస‌గా యువ‌హీరోల స‌ర‌స‌న అవ‌కాశాల అందుకుంది అందాల కేతిక‌. ఇటీవ‌ల 'బ్రో: ది అవతార్‌'లో తన న‌ట‌న‌తో మ‌రోసారి ఆక‌ట్టుకున్న‌ కేతిక శర్మ ఆకాష్ స‌ర‌స‌న రొమాంటిక్ చిత్రంతో క‌థానాయిక‌గా తెరంగేట్రం చేసిన సంగ‌తి తెలిసిందే. వైష్ణ‌వ్ తేజ్ స‌ర‌స‌న రంగ రంగ వైభ‌వంగా, నాగ‌శౌర్య స‌ర‌స‌న ల‌క్ష్య చిత్రంలో న‌టించింది. అయితే వ‌రుస చిత్రాల్లో న‌టిస్తున్నా ఆశించిన బ్లాక్ బ‌స్ట‌ర్లు ద‌క్క‌లేదు. ఉన్నవాటిలో బ్రో ఒక్క‌టే విజ‌యం సాధించింది.


అయినా జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస అవ‌కాశాలు అందుకుంటున్న భామ‌గా కేతిక‌కు పేరుంది. ఇక కేతిక శ‌ర్మ కు సోష‌ల్ మీడియాల్లో ఒక రేంజులో ఫాలోయింగ్ ఉంది. కేతిక అందాల‌ను ఎలివేట్ చేస్తూ ఎంపిక చేసుకున్న డిజైన‌ర్ బ్లాక్ టాప్ మ‌త్తెక్కిస్తోంది. బ్లూ డెనిమ్ బ్లాక్ టాప్ కి త‌గ్గ‌ట్టుగానే రెడ్ లిప్ స్టిక్ తో కేతిక హాట్ కంటెంట్ ని పెంచేసింది. ఈ లుక్ లో కేతిక మ‌త్తు పెంచుతోందంటూ యూత్ కామెంట్లు చేస్తున్నారు. కేతిక టూ హాట్ అంటూ కాంప్లిమెంట్లు ఇచ్చేస్తున్నారు.

ఇదీ స్వ‌గ‌తం:

కేతిక శ‌ర్మ మోడ‌ల్ కం న‌టిగా ఎద‌గ‌క ముందే ప్రముఖ యూట్యూబర్ గా ఓ వెలుగు వెలిగింది. పాపుల‌ర్ డైలాగ్‌లు, పాటల రీమిక్స్ ల‌తో కేతిక యూత్ లో పాపుల‌రైంది. 2021లో అనిల్ పాదూరి దర్శకత్వం వహించిన రొమాంటిక్ తో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైంది. పూరి జగన్నాధ్ రచించి నిర్మించిన తెలుగు చిత్రం రొమాంటిక్ లో ఆకాష్ క‌థానాయ‌కుడిగా న‌టించాడు. ఇటీవ‌ల బ్రో చిత్రంలోను ఆక‌ట్టుకునే న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించింది. త‌దుప‌రి రాజేష్ ఎం.సెల్వ దర్శకత్వంలో ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని సినిమాలో న‌టిస్తోంది. ఇందులో అదితి రావ్ హైదరీ- అన్సన్ పాల్ ఇత‌ర పాత్ర‌ధారులు. కేతిక కెరీర్ ఎదుగుద‌ల ఆస‌క్తిక‌రం. మునుముందు పెద్ద స్టార్ల స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకోవాల‌ని క‌ల‌లుగంటోంది.