Begin typing your search above and press return to search.

క్యూట్ లుక్స్ తోనే హీటెక్కించే అందం

సినిమా అవకాశాలు ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం చాలా చురుకుగా ఉంటుంది

By:  Tupaki Desk   |   4 Aug 2023 12:30 PM GMT
క్యూట్ లుక్స్ తోనే హీటెక్కించే అందం
X

బ్రో మూవీతో ఇటీవల ప్రేక్షకులను పలకరించిన హాట్ బ్యూటీ కేతిక శర్మ. ఈ బ్యూటీ టాలీవుడ్ కి పరిచయం అయ్యి చాలా కాలమే అవుతుంది. కానీ, పాపం చెప్పుకోదగిన హిట్ మాత్రం పడలేదు. దీంతో, తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి చాలా కష్టపడుతుంది. ఆమె అందం, నటనకు ఛాన్సులు అయితే వస్తున్నాయి కానీ, అవి కూడా అరకొరే. అందుకే, స్టార్ హీరోయిన్ కాదు కదా, మిడ్ హీరోయిన్ రేంజ్ ని కూడా ఇప్పటి వరకు చేరుకోలేకపోయింది.


సినిమా అవకాశాలు ఎలా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం చాలా చురుకుగా ఉంటుంది. గ్యాప్ లేకుండా, ఫోటోలు షేర్ చేస్తూనే ఉంటుంది. ఆ ఫోటోల్లో ఆమె తన అందాలను చూపిస్తూ, తన ఫాలోవర్స్ ని ఊరిస్తూ ఉంటుంది. తాజాగా కూడా కొన్ని హాట్ ఫోటోలు షేర్ చేసింది. షెరారా ప్యాంట్ కి మ్యాచింగ్ టాప్ ధరించింది. తన ఫోటోలకు క్యూట్ అని క్యాప్షన్ ఇచ్చింది కానీ, చూడటానికి మాత్రం చాలా హాట్ గా ఉంది.

తన ఎద అందాలు కనిపించేలా ఆమె ఫోటోలకు ఫోజులు ఇవ్వడం విశేషం. ఇక, నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు. ఇక, కామెంట్ల సంగతి అయితే చెప్పక్కర్లేదు. అంత బరువు ఎలా మోస్తున్నావు అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, ఇలాంటి ఫోటోలు పెట్టి చంపేస్తున్నావ్ కేతికా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు హాట్, క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, కేతిక టాలీవుడ్ కి పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరీ హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే తన అందంతో అందరినీ ఆకర్షించింది. కానీ, ఆ మూవీ ప్లాప్ కావడంతో, పెద్దగా క్లిక్ కాలేకపోయింది.

ఆ తర్వాత పంజా వైష్ణవ్ తేజ్ సరసన 'రంగ రంగ వైభవంగా', నాగ శౌర్య హీరోగా నటించిన ‘లక్ష్య’లో నటించింది. అవి కూడా క్లిక్ కాలేదు. తాజాగా బ్రోలో ఛాన్స్ వచ్చింది. ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ, క్రెడిట్ అంతా పవన్ ఖాతాలోకి వెళ్లిపోయింది. మరి ఈ మూవీ కేతిక ఫ్యూచర్ కి ఎంత ఉపయోగపడుతుందో చూడాలి.