Begin typing your search above and press return to search.

మహానటి మళ్లోటి కొట్టాల్సిందే..!

తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో కూడా నటించిన కీర్తి సురేష్ అక్కడ కూడా స్టార్ క్రేజ్ తెచ్చుకుంది

By:  Tupaki Desk   |   18 March 2024 7:48 AM GMT
మహానటి మళ్లోటి కొట్టాల్సిందే..!
X

నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మలయాళ భామ కీర్తి సురేష్ మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ మనసులు దోచేసింది. అప్పటి నుంచి తెలుగులో రాణిస్తూ వస్తుంది. తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో కూడా నటించిన కీర్తి సురేష్ అక్కడ కూడా స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. మహానటి సినిమా తర్వాత ఆమె రేంజ్ మరింత పెంచుకుంది. ఆ సినిమాలో కీర్తి సురేష్ నటనకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది.

మహానటి తర్వాత కీర్తి సురేష్ మరిన్ని ప్రయోగాలు చేయాలని అనుకున్నా ఆమెకు అందుకు తగినట్టుగా ఆఫర్లు రాలేదు. కమర్షియల్ సినిమాలు చేస్తూ అడపాదడపా వెరైటీ ప్రయత్నాలు చేస్తూ వచ్చింది కీర్తి సురేష్. లాస్ట్ ఇయర్ దసరా తో తెలుగులో మరోసారి తన మార్క్ హిట్ అందుకున్న కీర్తి సురేష్ తన టాలెంట్ గుర్తించాలని మరోసారి అందరికీ షాక్ ఇచ్చింది.

ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్ కు తెలుగు నుంచి పెద్దగా ఆఫర్లు రావట్లేదని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ మెగాస్టార్ చిరంజీవి తో భోళా శంకర్ సినిమా చేసిన కీర్తి సురేష్ ఆ సినిమా ఫ్లాప్ వల్ల ఎఫెక్ట్ అయ్యింది. తెలుగు కన్నా తనకు అవకాశాలు ఇస్తున్న కోలీవుడ్ మీదే దృష్టి పెట్టాలని ఫిక్స్ అయ్యింది. అయితే తెలుగులో మరో మహానటి లాంటి సినిమా పడితే కానీ కీర్తి సురేష్ టాలెంట్ ఏంటన్నది అర్ధం కాదు.

ఈమధ్యనే అమ్మడు బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా తన నటనతో బీ టౌన్ ఆడియన్స్ మెప్పు పొందాలని చూస్తుంది కీర్తి సురేష్. సౌత్ లో తన అభినయంతో మెప్పించిన కీర్తి సురేష్ నార్త్ సైడ్ కూడా తన ప్రభావం చూపించాలని ఫిక్స్ అయ్యింది. అయితే కీర్తి సురేష్ బాలీవుడ్ లో గ్లామర్ షో చేస్తుందా.. బీ టౌన్ ఆడియన్స్ ను మెప్పించాలంటే స్కిన్ షో కంపల్సరీ మరి దానికి కీర్తి సురేష్ రెడీ అయ్యిందా లాంటి వాటికి సమాధానం దొరకాల్సి ఉంది.

రీసెంట్ గా తెలుగు పాన్ ఇండియా సినిమాలో కీర్తి సురేష్ ఛాన్స్ అందుకుందని ఒక వార్త వచ్చింది. అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ చేస్తున్న సినిమాలో అమ్మడికి ఛాన్స్ వచ్చిందని చెబుతున్నారు. ఓ పక్క హిందీ సినిమాలు మరోపక్క తెలుగు పాన్ ఇండియా సినిమాలతో నేషనల్ లెవెల్ ఆడియన్స్ ని మెప్పించాలని చూస్తుంది అమ్మడు.