Begin typing your search above and press return to search.

మెల్లి మెల్లిగా మ‌హాన‌టి బాలీవుడ్‌కి జంప్!

ఫ్యామిలీమ్యాన్ ఫ్రాంఛైజీతో నిరూపించి, సిటాడెల్ సిరీస్ తో స‌మంత హిందీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రోసారి స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లూరుతోంది

By:  Tupaki Desk   |   9 Sep 2023 4:30 PM GMT
మెల్లి మెల్లిగా మ‌హాన‌టి బాలీవుడ్‌కి జంప్!
X

మ‌హాన‌టి కీర్తి సురేష్ మెల్లి మెల్లిగా బాలీవుడ్ కి జంప్ అవుతోందా? అంటే అవున‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. స‌మంత .. న‌య‌న‌తార లాంటి స్టార్ హీరోయిన్ల‌కు ఇటీవ‌ల బాలీవుడ్ లో అవ‌కాశాలు పెరిగాయి. ఫ్యామిలీమ్యాన్ ఫ్రాంఛైజీతో నిరూపించి, సిటాడెల్ సిరీస్ తో స‌మంత హిందీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రోసారి స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లూరుతోంది. అలాగే జ‌వాన్ తో న‌య‌న్ ఆశించిన‌ది సాధించింది. ఆ ఇద్ద‌రికీ ఆఫ‌ర్ల వెల్లువ అమాంతం పెరిగింద‌ని మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. ఇంత‌కుముందు రాశీఖ‌న్నా సైతం రాజ్ అండ్ డీకే ఫ‌ర్జీతో బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. పుష్ప త‌ర్వాత ర‌ష్మిక మంద‌న్న అద్భుత అవ‌కాశాలు అందుకుంటోంది.

ఇప్పుడు అదే కేట‌గిరీలో మ‌రో సౌత్ నటి చేర‌బోతోందంటూ ప్ర‌చారం సాగుతోంది. అందాల కీర్తి సురేష్ కూడా హిందీ చిత్ర‌సీమ‌లో రాణించి పాన్ ఇండియా స్టార్ గా వెల‌గాల‌ని క‌ల‌లు గంటోంది. కీర్తి ఇప్ప‌టికే బాలీవుడ్ లో న‌టించాల‌ని క‌ల‌లు కంది. కానీ ఆ క‌ల ఇన్నాళ్లు నెర‌వేరేలేదు. ఇప్పటికి నెర‌వేర‌బోతోంది. ఇటీవ‌లే కీర్తిని బాలీవుడ్ లో క్రేజీ ఆఫ‌ర్ వ‌రించింది. యువ‌హీరో వ‌రుణ్ ధావ‌న్ స‌ర‌స‌న ఈ భామకు అవ‌కాశం ద‌క్కింది. జ‌వాన్ తో బంప‌ర్ హిట్ కొట్టిన అట్లీ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు కావ‌డం ప్ర‌ధాన అస్సెట్ కానుంది. నిజానికి అట్లీ న‌య‌న‌తారకు అద్భుత‌మైన అవ‌కాశాన్నిచ్చారు. జ‌వాన్ తో న‌య‌న్ పాన్ ఇండియా స్టార్ డ‌మ్ ని అందుకుంది. త‌ర్వాత కీర్తి సురేష్‌కి అట్లీ ఆఫ‌ర్ ఇవ్వ‌డం అంటే రొట్టె విరిగి నెయ్యిలో ప‌డిన చంద‌మేన‌ని కూడా అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

కీర్తికి నిజానికి సౌత్ లో ఆశించినంతగా పెద్ద ఆఫ‌ర్లు లేవు.. కానీ ఇప్పుడు బాలీవుడ్ కి వెళుతోంది. అక్క‌డ ఆశించిన బిగ్ హిట్ సాధిస్తే ఒక యామీ గౌత‌మ్ లా ఆఫ‌ర్లు అందుకుంటుంద‌నే అంతా భావిస్తున్నారు. ఫ్యామిలీమేన్ ఫ్రాంఛైజీతో స‌మంత ఎదురేలేని న‌టిగా హిందీ ప్రేక్ష‌కుల్లో అభిమానం చూర‌గొంది. జవాన్ లో యాక్ష‌న్ క్వీన్‌గా మెరిపించిన న‌య‌న‌తార‌కు ఇప్పుడు హిందీ బెల్ట్ లో భారీ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. అదే తీరుగా ఇప్పుడు కీర్తి కూడా నిరూపించాల‌ని భావిస్తోంది.

సిటాడెల్‌లో వరుణ్ ధావన్ - సమంత రూత్ ప్రభుల జోడి హిందీ పరిశ్రమలో విపరీతమైన ఉత్సాహాన్ని సృష్టించింది. సమంత సౌత్ ఇండియన్ గ్రేస్ .. వరుణ్ ధావ‌న్ బాలీవుడ్ ఆకర్షణతో సిటాడెల్ సినిమాటిక్ బ్యూటీగా మారుతుంద‌ని భావిస్తున్నారు. సిటాడెల్ త్వ‌ర‌లో స్ట్రీమింగుకి సిద్ధ‌మ‌వుతుండ‌గా, వరుణ్ ధావన్ VD18లో కీర్తి సురేష్‌ స్క్రీన్‌ను షేర్ చేసుకుంటార‌నే వార్త అభిమానుల్లోను ఉత్సాహం నింపుతోంది.

వరుణ్ ధావన్ ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్ డ‌మ్ ని ఆశిస్తున్నాడు. అదే క్ర‌మంలో `సిటాడెల్`తో సౌత్ లోను త‌న‌దైన ముద్ర వేయాల‌ని త‌పిస్తున్నాడు. త‌దుప‌రి VD18 తో చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేయాలని త‌పిస్తున్నాడు. అభిమానులు సినీ ప్రముఖులు వ‌రుణ్ ధావన్ ప్ర‌తి ప్ర‌య‌త్నాన్ని ప‌రిశీలిస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో కీర్తిని ఈ అవ‌కాశం వ‌రించ‌డం పెద్ద ప్ల‌స్ కానుంద‌ని కూడా విశ్లేషిస్తున్నారు. అట్లీ సమర్పణలో మురాద్ ఖేతాని & ప్రియా అట్లీ నిర్మిస్తున్నారు. VD18 యాక్షన్ ఎంటర్‌టైనర్ క‌థాంశంతో తెర‌కెక్క‌నుంది. ఇది 31 మే 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.