Begin typing your search above and press return to search.

కీర్తి సురేష్ అమ్మ‌కి చిరంజీవి మాష్టారే!

టాలీవుడ్ లో కీర్తి సురేష్ క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. `మ‌హాన‌టి` స‌క్సెస్ తో తెలుగింట సావిత్రి అయిపోయింది. ఆమెని అభిమానించ‌ని అభిమాని లేడు. యువ‌కుల నుంచి అవ్వ తాత‌ల వ‌ర‌కూ అంతా కీర్తిని అభిమానిస్తారు.

By:  Tupaki Desk   |   6 Aug 2023 2:30 PM GMT
కీర్తి సురేష్ అమ్మ‌కి చిరంజీవి మాష్టారే!
X

టాలీవుడ్ లో కీర్తి సురేష్ క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. `మ‌హాన‌టి` స‌క్సెస్ తో తెలుగింట సావిత్రి అయిపోయింది. ఆమెని అభిమానించ‌ని అభిమాని లేడు. యువ‌కుల నుంచి అవ్వ తాత‌ల వ‌ర‌కూ అంతా కీర్తిని అభిమానిస్తారు. సావిత్ర పాత్ర‌లో న‌టించ‌డ‌మే ఆమె చేసుకున్న అదృష్టం. ఆ సినిమా ఆమెకి అంత గుర్తింపును తీసుకొచ్చింది. ఆ త‌ర్వాత అమ్మ‌డి జ‌ర్నీ గురించి తెలిసిందే.

మ‌రి కీర్తి సురేష్ ఓ న‌టి కుమార్తె అని ఎంత మందికి తెలుసు అంటే? చాలా త‌క్కువ మందికే కీర్తి గురించి తెలుసు. ఆమె మ‌ల‌యాళీ న‌టి మేనక కుమార్తెగా చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి ప్ర‌వేశించింది. మేన‌క తెలుగు సినిమాలు ఎక్కువ‌ చేయ‌న‌ప్ప‌టికీ మ‌ల‌యాళంలో అప్ప‌ట్లో పెద్ద హీరోయిన్. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `పున్న‌మి నాగు`లో న‌టించారు. ఇప్పుడ‌దే చిరంజీవి సినిమాలో మేన‌క కుమార్తె కీర్తి సురేష్ చిరుకి సిస్ట‌ర్ పాత్ర పోషిస్తుంది.

తాజాగా ఆనాటి అమ్మ జ్ఞాప‌కాల్ని కీర్తి సురేష్ గుర్తు చేసుకున్నారు. `మా అమ్మ చిరు స‌ర్ తో `పున్న‌మినాగు`లో న‌టించింది. అప్ప‌టికి అమ్మ‌కి 16 ఏళ్ల వ‌య‌సు. త‌న‌ని అప్పుడు చిరు స‌ర్ చిన్న పిల్ల‌లా చూసుకునేవారుట‌. ప్ర‌తీ విష‌యాన్ని ఎంతో ఓపిక‌గా నేర్పించేవారుట‌. చిన్న చిన్న త‌ప్పులేవైనా చేసినా వాటిని క‌రెక్ట్ చేసేవారుట‌. సెట్ లో ఆయ‌న ఎంతో నిరాడంబ‌రంగా ఉండేవారుట‌.

అమ్మ చెప్పిన ఈ విష‌యాల‌న్నీ ఓ రోజు సెట్లో చిరు స‌ర్ తో చెప్పా. ఆయ‌న చాలా సంతోష ప‌డ్డారు. మీ అమ్మ అమాయ‌కురాలు..కానీ నువ్వు స్వీట్..నాటు అంటూ న‌వ్వేసారు` అంది. మొత్తానికి మెగాస్టార్ కీర్తికే కాదు..వాళ్ల అమ్మ‌కి ఆ నాడు పాఠాలు బోధించిన మాష్టారే అని చెప్పొచ్చు. న‌టుడిగా చిరంజీవి జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న ఓ లెజెండ్. ఓ ఎన్ సైక్లో పీడియా. ఎంతో మంది నటీన‌టులు ఆయ‌న చిత్రాల ద్వారా వెండి తెర‌కు ప‌రిచ‌య‌మయ్యారు. ఆయ‌న స్పూర్తితో ఎంతో మంది చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నిల‌దొక్కుకున్నారు. స్టార్ల్ గా..ద‌ర్శ‌కులుగా..నిర్మాత‌లుగా ఎదిగిన సంగ‌తి తెలిసిందే.